కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇలా ఎన్ని పార్టీలు వచ్చినా మేం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెంటే నడుస్తాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అన్నారు.
మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లోనే నా ప్రయణం.. ఆయన అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నాను అన్నారు వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ)ని విలీనం చేశాం అన్నారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. వైఎస్సార్ జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు.. నేను మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్నాను అన్నారు.
YS Sharmila: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై చర్చ సాగుతోంది. కుదిరిన పొత్తులపై క్లారిటీ లేకపోగా.. కొత్త పొత్తులపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడడం.. కొత్త చర్చకు దారి తీసింది.. అసలు సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలతో పొత్తుల విషయం ఇంకా అస్పష్టంగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. పొత్తుల విషయం ఇంకా ఉందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఢిల్లీ చేరుకున్న వైఎస్ షర్మిల.. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవనున్నారు. హస్తం పార్టీ అగ్రనేతల సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు సమాచారం.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కుటుంబంతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లారు. భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుని, అక్కడి నుంచి ముఖ్యమంత్రి నివాసానికి షర్మిల వెళ్లారు.
ఈరోజు కేవలం వివాహ ఆహ్వానం ఇవ్వడానికి మాత్రమే వైఎస్ షర్మిల.. సీఎం జగన్ దగ్గరకు వస్తున్నారు.. అవసరమైతే షర్మిలతో నేను కూడా సీఎం జగన్ ఇంటికి వెళ్తానన్నారు ఎమ్మెల్యే ఆర్కే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇంట ఈ రోజు ఆసక్తికర పరిణామాలు జరగబోతున్నాయి.. కుటుంబ సమేతంగా సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్న షర్మిల.. తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవనున్నారు.. తన కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరితో వివాహ నిశ్చితార్థంతో పాటు పెళ్లి వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను జగన్‌కు అందజేయనున్నారు..
కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు షర్మిల అన్నారు. రేపే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని ఉద్దేశంతోనే తెలంగాణలో పోటీ చేయలేదని షర్మిల చెప్పారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో తమ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణలో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము పోటీ పెట్టకపోవడమే ప్రధాన కారణమని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించేందుకు తన…