షర్మిల పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి రోజా విశాఖలో మాట్లాడుతూ.. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒక సారి గమనించాలని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కల్పి అన్యాయం చేశారన్నారు. షర్మిల గారికి సలహా ఇస్తున్నానని, ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుండి మనకి రావాల్సిన 6 వేల కోట్లు అని, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి…
నేను రాజకీయం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్) తీసుకున్నానని ప్రకటించారు.. ఇక, యాంటీ మోడీ ఓటింగ్ ఇండియా కూటమి కి ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న సమస్య పెద్ద విబేధం ఏం చూపదన్నారు.. నేనేమీ పెద్ద కష్టాలు చూస్తాను అనుకోవడం లేదని చమత్కరించారు ఉండవల్లి..
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు.
టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారంలో తాజా పరిణామాలపై హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పొత్తు ధర్మాన్ని పాటించక పోయినా చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ ఎందుకు ప్రయాణం చేస్తున్నారో జనసేన కార్యకర్తలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొత్తు ధర్మం లేకపోయినా, ప్యాకేజీ ధర్మం గిట్టుబాటు అవుతుందని భావిస్తున్నారా..? అని ఎద్దేవా చేశారు.. అసలు ఈ దేశంలో ఏ ధర్మాన్ని పాటించని వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.
అసంతృప్తితో సీఎం వైఎస్ జగన్‌ను వదిలిపెట్టి వెళ్లే వారి వల్ల ఆయనకు ఏం నష్టం జరగదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లి.. మా ప్రత్యర్థి చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెస్‌కు వైఎస్ షర్మిల పనిచేస్తున్నారని అందరికీ తెలుసన్నారు. మా ప్రభుత్వం నచ్చక ఆమె మాట్లాడుతుందని, ఎవరైనా ఆమె మాటలు నమ్మతారా? అని ప్రశ్నించారు. భావితరాల కోసం పనిచేసే విజనరీ ఉన్న నాయకుడు సీఎం జగన్ అని, తనకు ఓటేయాలని ధైర్యంగా…