విద్య, వైద్యం, వ్యవసాయం, న్యాయం కోసం ప్రతిరంగంలోనూ ప్రజలు రోడెక్కుతున్నారని తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలోని అన్నదాతలు రోడెక్కుతున్నారని, కొనుగోలు సెంటర్లలో వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి రంగంలోనూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలపాల్సి వస్తోందని అన్నారు. విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడ్డెక్కాలి.. కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల…
కేసీఆర్.. మీది గుండెనా..బండనా అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే సెలెక్ట్ అయిన స్టాఫ్ట్ నర్సులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వండి అని అన్నారు. 658 కుటుంబాల ఉసురు పోసుకోకండి. బాధితులెవరూ అధైర్య పడొద్దు.. అండగా నేనుంటా అని హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ లో తెల్ల రేషన్ కార్డున్న వారందరు కవర్ కారు. అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందే అని చెప్పారు. బయట పేదలు పిట్టల్లా రాలుతుంటే మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.…
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై మరోసారి కౌంటర్ వేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ సర్కార్ అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికనే పోస్టులు భర్తీ చేస్తుందని పేర్కొన్న వైఎస్ షర్మిల.. సిఎం పదవిని కూడా కాంట్రాక్టు పద్దతిన చేపట్టాలని కెసిఆర్ కు చురకలు అంటించారు. “అన్నింటా కాంట్రాక్ట్ పోస్టులే అయితే .. ఇక సిఎం పదవి కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే ..” అని ముచ్చట చెప్పిన కెసిఆర్ సారుకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే ముద్దుగా కనిపిస్తున్నాయి,…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,20,709 కి చేరింది. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కరోనా బాధితులను అదుకునేందుకు “ఆపదలో తోడుగా YSSR”అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. “తెలంగాణ ఆడబిడ్డలారా.. ధైర్యం…
సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు చనిపోతే చలించని ఛాతీలో ఉంది గుండెనా బండరాయా? పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు అందరూ చూడాలని పేర్కొన్నారు. నేను ఉద్యోగ దీక్ష ఎందుకు చేసానో అందరికి తెలుసని.. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగాలు రాక ఆత్మాభిమానం చంపుకోలేక మానసికంగా రోజు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు చనిపోయేలా చేసింది కేసీఆర్ అని.. కేసీఆర్ ఒక మర్దరర్…
తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షకు కూర్చున్నారు. అయితే, సాయంత్రం తరువాత పోలీసులు దీక్షను అడ్డుకున్నారు. అక్కడి నుంచి వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేర్చడంతో అక్కడే ఆమె దీక్షకు దిగారు. ఇంట్లో నుంచే షర్మిల దీక్ష చేస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి మూడు రోజులపాటు దీక్ష చేస్తున్నట్టు ఏప్రిల్ 9 వ తేదీన…
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్ షర్మిల ఈ ఉదయం నుండి ఇందిరాపార్క్ వద్ద దీక్షకు ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.95 లక్షల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో ఆమె ఈ దీక్ష చేశారు. తెలంగాణలో సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయని కారణంగా మనోవేదనకు గురైన అనేక…
వైఎస్ షర్మిల ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పార్టీ పేరు, జెండా అజెండాను వైఎస్ఆర్ జయంతి రోజున ప్రకటిస్తానని చెప్పారు. ఇక నిరుద్యోగుల కోసం ఆమె ఈరోజు నుంచి మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేయబోతున్నారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్షకు దిగుతున్నారు. ఇక ఇదిలా ఉంటె, త్వరలోనే రాష్ట్రంలో ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ షర్మిల…