వైఎస్ఆర్ టీపీ షర్మిల పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. హైద్రాబాద్ టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పై షర్మిల విషం కక్కుతోందని మండిపడ్డారు. సంస్కార హీనంగా మాట్లాడితే ఏమైనా జరగొచ్చని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా షర్మిల మాట్లాడితే టీఆర్ఎస్ బాధ్యత వహించదన్నారు.
ఆర్థిక పరిస్థితి పై హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్దమని, ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా అని ఈటెల సవాల్ విసిరారు. ప్రజల డబ్బుతోనే ఓట్లు కొనే నీచ సంస్కృతికి కేసీఆర్ దిగజారాడని ఆరోపించారు. 2021 22 ఆర్థిక సంవత్సరం కి 36 వేల కోట్లు వడ్డీ కడుతుందని అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు. కవిత చేసిన ట్వీట్ కు ఎమ్మల్యే ఈటెల స్పందించారు. షర్మిల తానా అంటే తందానా అని బీజేపీ నేతలు పరోక్షంగా ఆక్షేపించారు. వారు వదిలిన బాణం తానా అంటే తామర పువ్వులు అని ట్వీట్ చేసిన కవిత పై ఈటెల మండిపడ్డారు.
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ రోజు పాదయాత్రతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ ఈ రెండు పార్టీలు దూకుడు పెంచాయి. వైఎస్ ఆర్టీపీ షర్మిల పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న హైడ్రామా కొనసాగింది.
వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇంటికి చేరుకున్నారు షర్మిల. షర్మిల ఇంటి దగ్గరే వైఎస్ విజయమ్మ ఉండి షర్మిలకు హారతి ఇచ్చారు.
YS Sharmila : వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
High Court permits YS Sharmila's padayatra: వరంగల్ జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సోమవారం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో చేపట్టిన పాదయాత్ర రణరంగంగా మారింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఇదిలా ఉంటే తనపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ షర్మిల ఈ రోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. నిన్న దాడి…