తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వరంగల్‌లో ఆమె యాత్రను అడ్డుకోవడం, దాడి కూడా జరిగిన తర్వాత.. ఒక్కసారిగా వైఎస్ షర్మిలపై ఫోకస్ పెరిగింది.. వరంగల్ ఘటనకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వైఎస్ షర్మిలను కారుతో పాటు పీఎస్‌కు తరలించడం కూడా చర్చగా మారింది.. అరెస్ట్‌లు, బెయిల్‌పై విడుదల కావడం.. ఆ తర్వాత రోజు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలవడం,…
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు వరంగల్ పోలీసులు.. లింగగిరి క్రాస్ రేపు తన పాదయాత్రను తిరిగి ప్రారంభించడానికి వైఎస్ షర్మిల సిద్ధం అయ్యారు.. రేపటి నుండి పాదయాత్రను పునఃప్రారంభించేందుకు గాను పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.. అయితే, పాదయాత్ర అనుమతి కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దు..? అంటూ ఆమెకు పోలీసులు షోకాజ్ నోటీసులను అందజేశారు. పాదయాత్రకు మొదటి సారి పోలీసులు అనుమతిని ఇచ్చినప్పుడు.. వారు…
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్రానికి రాజన్న రాజ్యాన్ని ప్రవేశపెడతానంటూ షర్మిల పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర వివరాలను తెలిపారు. పాదయాత్రకు రక్షణ కల్పించాలని కోరామని ఆమె వెల్లడించారు. నర్సంపేటలో టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారని.. దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టారని ఆమె ఆరోపించారు.
నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాలిబన్ లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏమి అనలేదని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని ఆమె పేర్కొన్నారు. రెండు రోజులుగా జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్ కు వివరించానని తెలిపారు.
నర్సంపేటలో వైఎస్‌ఆర్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. వాగ్వాదాల మధ్య చివరికి షర్మిలను తను కారులో ఉండగానే పోలీసులు క్రేన్ సహాయంతో పోలీస్టేషన్ కు తరలించారు.
తెలంగాణ పాలకులను టెర్రరిస్టులు అంటూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విధ్వేషాలు రగిల్చేలా మాట్లాడిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదును అందజేశారు.