తెలంగాణ రాజకీయం వేడెక్కింది. నిన్న నాటకీయపరిణాల మధ్య వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఎమ్మెల్సీ కవితపై సెటైర్లు వేశారు. అయితే.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టస్త్రాలు సంధించారు. అయితే.. తాజాగా కవిత ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతులు అని, షర్మిల బీజేపీ పార్టీ కోవర్టు అంటూ , బీజేపీ- షర్మిల దొంగాట అన్నారు.
Also Read : MLA Thopudurthi Prakash Reddy: కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదు..
పొలిటికల్ టూరిస్టును కాదు.. ఉద్యమ బిడ్డను అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ‘అమ్మా.. కమల బాణం ఇది మా తెలంగాణం.. పాలేవో నీళ్ళేవో తెలిసిన.. చైతన్య ప్రజా గణం.. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు.. నేడు తెలంగాణ రూటు.. మీరు కమలం కోవర్టు ఆరేంజ్ ప్యారెట్టు.. మీ లాగా.. పొలిటికల్ టూరిస్ట్ కాను నేను.. రాజ్యం వచ్చాకే రాలేదు నేను.. ఉద్యమంలో నుంచి పుట్టిన.. మట్టి ‘కవిత’ను నేను !’ అంటూ ట్విట్టర్‌లో షర్మిలకు కౌంటర్ ఇచ్చారు.
Also Read : Suicide Blast: పోలీసు ట్రక్కు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి, 27 మందికి గాయాలు
అమ్మా.. కమల బాణం
ఇది మా తెలంగాణం
పాలేవో నీళ్ళేవో తెలిసిన
చైతన్య ప్రజా గణంమీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు
నేడు తెలంగాణ రూటు
మీరు కమలం కోవర్టు
ఆరేంజ్ ప్యారేట్టుమీ లాగా
పొలిటికల్ టూరిస్ట్ కాను నేను
రాజ్యం వచ్చాకే రాలేదు నేను
ఉద్యమంలో నుంచి పుట్టిన
మట్టి " కవిత" ను నేను ! https://t.co/rkGthDtHF9— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022