YS Sharmila : వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది.. షర్మిలతో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా.. తమ క్లయింట్ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని.. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ.. పోలీసులు అరెస్ట్ చేసిన తీరును తప్పుబట్పటారు షర్మిల తరఫు లాయర్లు. ఇక, ఇరుపక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై నాంపల్లి కోర్టులో కీలక వాదనలు జరిగాయి. శాంతిభద్రతల సమస్య వస్తుందనే షర్మిలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.
Read Also: Telugu Teacher: తెలుగు సోది క్లాస్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్.. కర్ర విరిగేలా కొట్టిన టీచర్
రోడ్డుపై షర్మిల, పార్టీ కార్యకర్తలతో న్యూసెన్స్ క్రియేట్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు. షర్మిలకు రిమాండ్ విధించకపోతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. షర్మిల న్యాయవాదులు రిమాండ్‌ను వ్యతిరేకించారు. తప్పుడు కేసులు నమోదు చేశారని, జరిగిన ఘటనకు పెట్టిన కేసులకు సంబంధంలేదని వాదించారు. ఉద్దేశ్యపూర్వకంగానే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తే అరెస్ట్ చేశారని ప్రస్తావించారు. పోలీసుల విధులకు షర్మిల ఆటంకం కలిగించలేదని పేర్కొన్నారు.
Read Also: Most Expensive Vegetable: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెజిటబుల్.. కేజీ రూ.లక్ష
ఇది ఇలా ఉండగా, వైయస్ షర్మిల తో పాటు మరో ఆరుగురిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసును నమోదైంది. వైయస్ షర్మిల, హిందూజా రెడ్డి, సుధారాణి, ఎండి ముష్రాఫ్, భాష, సంజీవ్ కుమార్, శీనులపై 143, 341, 290, 506, 509, 336, 382 r/w 149లకింద కేసులు నమోదు చేశారు. రాష్ అండ్ నెగ్లిజెన్స్ గా డ్రైవ్ చేస్తూ తమపైకు వాహనం దూసుకొచ్చేటట్టు నడిపారని పంజాగుట్ట ఎస్సై అఖిల ఫిర్యాదు చేశారు. అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తుండగా వీడియో చిత్రీకరిస్తున్న ఎస్సై మొబైల్ ఫోన్ లాక్కున్నారన్నారు. డ్యూటీ చేస్తుండగా విధులకు ఆటంకం కలిగించిందంటూ ఫిర్యాదు చేశారు.