YS sharmila: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇంటికి చేరుకున్నారు షర్మిల. షర్మిల ఇంటి దగ్గరే వైఎస్ విజయమ్మ ఉండి షర్మిలకు హారతి ఇచ్చారు. వ్యక్తిగత పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా తమ క్లయింట్ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని షర్మిల పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె ఆరోపించగా.. పోలీసులు అరెస్ట్ చేసిన తీరును తప్పుబట్పటారు షర్మిల తరఫు లాయర్లు. అయితే.. ఇరుపక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ షర్మిలకు బెయిల్ మంజూరు చేశారు.
Read also:Zombie Virus: 48,500 ఏళ్ల నాటి జాంబీ వైరస్ వెలుగులోకి.. మరో 12 కొత్త వైరస్‌లు కూడా!
వాదోప వాదనలు:
ఈ అంశంపై నాంపల్లి కోర్టులో కీలక వాదనలు జరిగాయి. శాంతిభద్రతల సమస్య వస్తుందనే షర్మిలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. రోడ్డుపై షర్మిల, పార్టీ కార్యకర్తలతో న్యూసెన్స్ క్రియేట్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు. షర్మిలకు రిమాండ్ విధించకపోతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. షర్మిల న్యాయవాదులు రిమాండ్‌ను వ్యతిరేకించారు. తప్పుడు కేసులు నమోదు చేశారని, జరిగిన ఘటనకు పెట్టిన కేసులకు సంబంధంలేదని వాదించారు. ఉద్దేశ్యపూర్వకంగానే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తే అరెస్ట్ చేశారని ప్రస్తావించారు. పోలీసుల విధులకు షర్మిల ఆటంకం కలిగించలేదని పేర్కొన్నారు.