Minister Sandhya Rani: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా మండిపడింది. పిచ్చి జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ గా మారటమే జగన్ 2.0 అని పేర్కొంది. శవం లెగిస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్.. విజయమ్మ, షర్మిలా ఆయుష్షు గట్టిది కాబట్టే అతడికి దూరంగా ఉంటున్నారు.. జగన్ తీరు మారకుంటే.. గతసారి 11 సీట్లు ఇచ్చిన ప్రజలు.. ఈసారి చొక్కా పట్టుకుని రాష్ట్రం బయటకు గెంటుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడించటం ఒక్కటే ఇక మిగిలి ఉంది.. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని జగన్ ను హెచ్చరిస్తున్నాను అని మంత్రి సంధ్యారాణి తెలిపింది.
Read Also: Saif Ali Khan Attack Case: సైఫ్ పై దాడి చేసింది అతనే.. వేలిముద్రలు దొరికాయ్?
ఇక, ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలిసిందేనని మంత్రి సంధ్యారాణి చెప్పుకొచ్చింది. లండన్ లో తెచ్చుకున్న మందులు పని చేయట్లేదు.. అతడి మానసిక పరిస్థితి చూస్తే అర్ధమవుతోందని ఎద్దేవా చేశారు. జగన్ మానసిక పరిస్థితిని చూసి జాలిపడి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి నేను సిఫార్సు చేస్తాను అని ఆమె సెటైర్లు వేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ సాయంతోనైనా జగన్ ఓ మంచి డాక్టర్ కు చూపించుకోవాలి అని సలహా ఇచ్చింది. అబద్ధాల్లో ఆస్కార్ పొందే సైకో జగన్మోహన్ రెడ్డి.. అసెంబ్లీకి వెళ్లి మాట్లాడమని ప్రజలు ఎన్నుకుంటే.. స్పీకర్ చెప్పాలి అలంటున్న జగన్ కు పిచ్చి ఏ స్థాయిలో ముదిరిందో అర్ధమవుతోంది.. ఐదేళ్ళు బూతులు మాట్లాడిన జగన్ నోట నీతులు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.. జగన్ కు విశ్వసనీయత అనే పదం తెలుగులో రాయటం రాదు, ఇంగ్లీషులో అర్ధం తెలీదని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.