CM Chandrababu: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీకి, ఢిల్లీకి దగ్గరి పోలికలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. లిక్కర్ పేరుతో సిస్టమ్ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం స్కాంతో పోల్చుకుంటే, ఢిల్లీలో జరిగిన స్కాం చాలా చిన్నది. మద్యం కుంభకోణంలో వచ్చే డబ్బు, పాపిష్టి డబ్బు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి, వేల కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు.. ఢిల్లీలో ఎక్కడ పోయినా చెత్త ఉంటుంది.. మెయిన్ రోడ్ లో కూడా చెత్త ఉంటుంది. ఢిల్లీలో హై పొల్యూషన్.. ఢిల్లీ టోటల్ ఫెయిల్యూర్ మోడల్ అన్నారు.. లిక్కర్ పేరుతో సిస్టమ్ సర్వ నాశనం చేశారు. ఋషికొండలో కూడా ఇదే పరిస్థితి.. ఎమ్మార్వో కార్యాలయాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు.. బటన్ నొక్కే కార్యక్రమం ఢిల్లీలో సక్సెస్ కాలేదు.. ఏపీలో కూడా ఇలాగే ఉండేదన్నారు చంద్రబాబు..
Read Also: Bengaluru Metro: ప్రయాణికులపై మెట్రో బాదుడు.. భారీగా పెరిగిన ఛార్జీలు
సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది.. మౌలికవసతులు వస్తాయి. సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్లే అన్నారు సీఎం చంద్రబాబు… 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలను తెలుగుబిడ్డ పీవీ తీసుకువచ్చారు. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు.. ఇక, మోడీ వికసిత్ భారత్ 2047 తీసుకున్నారు.. మనం వికసిత్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నామని వెల్లడించారు.. మరోవైపు, నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి.. తెలంగాణలో నా అరెస్ట్ నిరసనలు అణచి వేయాలని చూసి ఫలితం అనుభవించారంటూ బీఆర్ఎస్ సర్కార్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.. ప్రపంచంలో ఇండియా నంబర్ వన్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందన్నారు.
Read Also: Bengaluru Metro: ప్రయాణికులపై మెట్రో బాదుడు.. భారీగా పెరిగిన ఛార్జీలు
ఇక, 2.0 అని మళ్లీ ఒక సైకాలజికల్ క్రియేషన్ చేయాలని చూస్తున్నారు అంటూ జగన్‌పై సెటైర్లు వేశారు చంద్రబాబు.. నేను సంపద సృష్టిస్తా అని చెప్తున్నా.. కానీ, కేసులు పెట్టు… కక్ష తీర్చుకో అంటే ఎలా..? అని ప్రశ్నించారు.. ఎమ్మెల్యేగా ఓటేశారు.. ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఇవ్వాలంటే ఎలా..? బ్యూటీ ఆఫ్ డేమోక్రసీని అర్ధం చేసుకోవాలని సూచించారు.. జగన్ ప్రతిపక్ష స్థానంపై స్పందించిన చంద్రబాబు.. విలువల గురించి ఆయన మాట్లాడడం ఏంటి..?, విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే అని వ్యాఖ్యానించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..