Mopidevi Venkataramana: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు, ఎన్నెన్నో ఒడి దుడుగులు ఎదుర్కొన్నాను అని తెలిపారు. నా మనస్తత్వం, వ్యక్తిత్వం తెరిచిన పుస్తకం లాంటిదని చెప్పుకొచ్చారు. ఈ ప్రయాణంలో నేను సంపాదించిన ఆస్తి విలువలు, విధేయత, విశ్వసనీయత.. ప్రలోభాలకి పదవీకాంక్షలకి అవకాశవాదానికి, ఒత్తిళ్లకి లొంగిపోయేవాడిని కాదని నీ అంతరాత్మకే తెలుసు అంటూ మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు.
Read Also: Hydra: శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ హోర్డింగులపై హైడ్రా కూల్చివేతలు
ఇక, విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే.. ఒక్కరితో కూడా మాట పడకుండా ఈ రోజు వరకు రాజకీయాల్లో కొనసాగుతున్నాను అని మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. నేను ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగే వ్యక్తినో కాదో మీ (జగన్) అంతరాత్మకే తెలుసు అంటూ చెప్పుకొచ్చారు. ఆలా లొంగిపోయే వ్యక్తిని అయితే కేసుల్లో ముద్దాయిగా ఉండేవాడిని కాదని తెలిపారు. భయపడటం అనేది నా రక్తంలోనే లేదు.. నా జీవితం ప్రజా సేవకే అంకితం చేశాను అని వెంకట రమణ పేర్కొన్నారు.