వేణుంబాకం విజయసాయిరెడ్డి.... ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూగా ఓ వెలుగు వెలిగిన ఈ లీడర్ రాజకీయాల్లో డిఫరెంట్ పీస్ అని చెప్పుకుంటారు. చిన్న విషయాన్ని కూడా ఓ సంచలనంగా చెప్పడంలో సరిలేరు నాకెవ్వరూ..... అన్నట్టుగా ఉంటుందట ఆయన వ్యవహారం. ఈ క్రమంలోనే... తాజాగా ఆయన ఎక్స్‌లో పెట్టిన ఓ మెసేజ్.... పొలిటికల్ పండిట్స్‌కే గట్టి పని పెట్టిందంటున్నారు. ఏపీ మద్యం ముడుపుల కేసులో సిట్ విచారణకు హాజరు కావాల్సిన వేళ ఎక్స్‌లో మాజీ ఎంపీ పెట్టిన మెసేజ్…
సీఎం చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్లు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంట్రామిరెడ్డి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాడంటే విచిత్రమైన వాతావరణం ఉంటుందన్న ఆయన.. ఆయన వళ్లే.. ఎండకాలంలో వర్షాలు, వర్షాకాలంలో వర్షాభావం ఉందని ఎద్దేవా చేశారు.. ఈ భిన్నమైన వాతావరణం కారణంగా.. ఒక్క పంట రైతులు వేయలేకపోతున్నారు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పంట పెడితే నాశనమే అంటూ హాట్ కామెంట్లు చేశారు..
ప్రముఖ నటి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత బి.సరోజాదేవి మృతి పట్ల మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ బాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని పేరొన్నారు. ‘సరోజాదేవి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. సరోజాదేవి గారు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరించారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని…
Ambati Rambabu: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కూటమి ఏడాది పాలన సుపరిపాలన కాదు.. మోసపు పరిపాలన.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ ఫైర్ అయిన ఆయన.. ప్రజలు తమ సమస్యలను స్వేచ్చగా చెప్పుకుని ప్రభుత్వం నుండి సమాధానం కోరుకునే అవకాశం ఉండాలి.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులు భంగం కలుగుతోంది.. చంద్రబాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోంది. పోలీసులతో అధికార దుర్వినియోగం…
కృష్ణా జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయి. పామర్రు, అవనిగడ్డ నియోజక వర్గాల్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మీటింగ్స్ లో పేర్ని నాని మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ మాదిరి.. మీరు కూడా చెడిపోయారా..? లోకేష్ రెడ్ బుక్ అంటే.. మీరు రప్పా రప్పా అంటున్నారు అన్నారు. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి తప్ప రప్పా రప్పా అని అనటం కాదన్నారు.…
రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గిట్టుబాటు ఇవ్వడం లేదని వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల వద్దకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తే ఏడుస్తారు అని కూటమి ప్రభుత్వంను విమర్శించారు. ఏపీలో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉండటం సమాజానికి విచారకరం అని పేర్కొన్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి జగన్ గారిని తిట్టడానికి తప్ప ఎక్కడైనా తిరిగారా?…
వైఎస్ జగన్ పర్యటనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు.. ఎక్కువ మంది పోలీసులను పెడితే.. 2 వేల మంది పోలీసులను పెట్టారని మళ్లీ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై మరో కేసు నమోదైంది.. జగన్ పర్యటనపై ఇప్పటి దాకా మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి.. అనుమతి లేక పోయినా వైఎస్ జగన్ టూర్ లో రోడ్ షో చేపట్టారని కేసు నమోదు చేశారు పోలీసులు.. హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేకుండా వందలాది మంది కార్యకర్తలను తీసుకొచ్చారని మరో కేసు పెట్టారు..
వైఎస్ జగన్ అంటేనే జనం అని, ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మామిడి రైతుల్లో భరోసా నింపడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వచ్చారన్నారు. దేశంలోనే మా నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ ఉన్న లీడర్ అని పేర్కొన్నారు. రైతుల్లో భరోసా కల్పించడానికి పర్యటన చేస్తే.. తమ నాయకులను…