భారత చెస్ హిస్టరీలో నయా హిస్టరీ క్రియేట్ చేసింది కోనేరు హంపి. తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అద్భుతమైన ఆటను ఆడి చైనాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ యుక్సిన్ సాంగ్‌ను నిలువరించి సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోనేరు హంపి 1.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి గేమ్‌లో తెల్లపావులతో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి విజయం సాధించిన హంపి, రెండో గేమ్‌లో డ్రా చేసుకుని సెమీస్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కోనేరు హంపి సాధించిన ఘనత పట్ల ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read:AM Ratnam: పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు!
మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ ద్వారా అభినందించారు. మీ విజయం భారతదేశానికి గర్వకారణం.. దేశవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభకు నిజమైన ప్రేరణ.. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని, కీర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నాను.. అని రాసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు “మన తెలుగు కుమార్తె ప్రపంచ వేదికపై కాంతులు విరజిమ్ముతోంది. నీ ఘనత దేశవ్యాప్తంగా మమ్మల్ని గర్వించేలా చేస్తోంది” అని అభినందించారు.