ఆంధ్రప్రదేశ్ మంత్రులు భయపడుతున్నారా? జగన్ పేరెత్తాలంటే జంకుతున్నారా? అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని ఆయన ఏ రేంజ్లో టార్గెట్ చేసినా… దీటైన కౌంటర్ వేయడానికి మంత్రులు వెనకాడుతున్నారా? ప్రతిపక్షాన్ని గట్టిగా టార్గెట్ చేయమని ముఖ్యమంత్రి ఓ వైపు ముల్లుగర్రతో పొడుస్తున్నా… ఎక్కువ మంది మినిస్టర్స్లో చలనం ఉండటం లేదా? ఎందుకలా జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 13 నెలలైంది. తొలి ఏడాది ఎలా గడిచిపోయినా…. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ జనంలో తిరగడం…
Gadikota Srikanth Reddy: సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధం అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా ఉన్నదే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెడుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
Minister Nimmala: విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గంలో చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది..
గట్టిగా కళ్లు మూసుకుంటే మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం కౌంటర్ ఇచ్చారు. క్లైమోర్ మైన్సే నన్ను ఏం చేయలేదు.. జగన్ లాంటి వాళ్లు నన్ను ఏం చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. తిట్లు, శాపనార్ధాలు నాకు తాకవు అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Minister Payyavula: పలేగాళ్ల రాజ్యం గురించి విన్నాం.. కప్పం గట్టమని పొలంలో పంటలు కోసుకుపోయారు.. పాలేగాళ్ల వంశానికి చెందినవాడు జగన్ అని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పాలేగాళ్ల రాజ్యం తిరిగి తీసుకురావాలని జగన్ చూస్తున్నారు.. చంద్రబాబు 100 రోజుల్లో 6 పంపుల నుంచి 12 పంపుల ద్వారా నీరు విడిచే విధంగా పనులు చేశారు.
పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తే.. సస్పెన్షన్ కానుకగా ఇచ్చారని వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఏపీ ఆగ్రోస్ మాజీ చైర్మన్ నవీన్ నిచ్చల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, వైసీపీ అధిష్టానం తనను ఏమీ అడగలేదని మండిపడ్డారు. 15 ఏళ్లు నందమూరి బాలకృష్ణతో పోరాడి పార్టీ కోసం పని చేశానని.. తనని కాదని ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చినా పార్టీ కోసం పని చేశానన్నారు. తన సస్పెన్షన్ వెనుక…
MLA Kotamreddy’s Tweet Goes Viral Amid Political Dialogue War: ఇటీవలి రోజుల్లో ‘రప్పా.. రప్పా నరుకుతాం’ అనే డైలాగ్ ఏపీ రాజకీయాల్లో బాగా ఫేమస్ అయింది. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ‘రప్పా.. రప్పా నరుకుతాం’ అనే పోస్టర్లు కార్యకర్తలు పెట్టడం, వాటిని వైసీపీ అధినేత సమర్ధించడం జరిగింది. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కూడా మరోసారి జగన్ స్పందించారు. సినిమాలోని డైలాగునే తమ…
సీఎం చంద్రబాబుపై అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. 76 ఏళ్ల ముసలోడివి నువ్వు.. ఎంతకాలం బతుకుతావ్?’ అని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ధ్వజమెత్తారు. చందబాబుకు 76 ఏళ్ల వయసా?, ఎన్నాళ్లు ఉంటాడో చెప్పలేమా.. ఇలాంటి మాటలేనా మాట్లాడేది అని ఫైర్ అయ్యారు. తాను సీఎం చంద్రబాబును మొన్న ఢిల్లీలో చూశానని, 26 ఏళ్ల కుర్రాడిలా పరుగెత్తుతూ రాష్ట్రానికి కావాల్సిన…
YS Jagan suspends Hindupur ycp leaders: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో.. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఇద్దరు వైసీపీ కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అధిష్టానం హెచ్చరించింది. వైసీపీలో…
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వలేదంటూ ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో టీడీపీ నాయకులు చేసిన అరాచకాలు మరువ లేకుండా ఉన్నారని, పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే సమస్యే లేదన్నారు. పెద్దారెడ్డి విషయంలో ఎంత దూరమైనా వెళ్తానని, తనతో ప్యాక్షన్ చేస్తానని సవాలు విసిరిన వ్యక్తిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు.