YSRCP Chandrasekhar Reddy on AP DSPs Death: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర డ్యూటీ చేసిన కానిస్టేబుల్‌ని వెంటనే డ్రైవర్‌గా హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు నాయుడు డ్యూటీకి ఎలా పంపించారు అని వైసీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. తాను బాగా అలసిపోయానని, డ్యూటీ చేయలేనని చెప్పినా బలవంతంగా పంపించారని మండిపడ్డారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం చెందారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనలు సాఫీగా సాగితే చాలా?.. పోలీసు కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదా? అని చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. రోడ్డు ప్రమాదంలో డీఎస్పీలు మేక చక్రధరరావు, జల్లు శాంతారావులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
Also Read: YS Jagan: సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్.. సర్వత్రా ఆసక్తి!
‘ప్రభుత్వ ఉద్యోగులకు, పీ4కి సంబంధం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు దొంగ హామీలు ఇచ్చారు. ఉపాధ్యాయులు, చిన్న తరహా ఉద్యోగులు పేదలను దత్తత తీసుకోవడం ఏంటి?. ఉపాధ్యాయులకు రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదు. సంపద సృష్టించడం అంటే ఉద్యోగుల నోరు కొట్టడమా?. అడ్మినిస్ట్రేషన్‌ని తప్పుదోవ పట్టించేందుకు పీ4 తీసుకు వచ్చారా?. రానున్న రోజుల్లో ఉద్యోగులు, ప్రభుత్వం, రోడ్లపైకి వస్తాయి’ అని చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు.