ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు నిండింది. నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఇక కరోనా ప్రధానంగా ఈ రెండేళ్లలోనూ వెంటాడింది. గత మార్చిలో మొదలై ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం…
జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రఘురామ పిటీషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జగన్కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చిన సీబీఐ కోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. జూన్ 1 వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని, 1 వ తేదీన కౌంటర్ దాఖలు చేయకుంటే నేరుగా విచారణ…
టౌక్టే తుఫాన్ నుంచి ఇంకా బయటపడక ముందే ఇప్పుడు మరో తుఫాన్ భయపెడుతున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం బలమైన యాస్ తుఫాన్ గా మారి ఈనెల 26వ తేదీన ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. తీవ్రమైన తుఫాన్ గా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంతంలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా తూర్పు తీరప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో…
ఏపి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అయ్యాయి. ఒక్కరోజు మాత్రమే ఈ బడ్జెట్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశాల్లో ఉదయం 9 గంటలకు గవర్నర్ ప్రసంగించారు. అనంతరం సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సభలో 2021-22 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ అంచనా రూ.2,29,779.21 కోట్లు. వెనక బడిన కులాలకు బడ్జెట్ లో 32శాతం అధికంగా నిధులు కేటాయించారు. ఇక ఏ…
నాలుగు బోధనాసుపత్రుల్లో సీటీ, ఎంఆర్ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎం ఆర్ఐ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్దతిలో, టెక్నాలజీ అప్డేట్స్ లేకుండా ఉన్నాయి. 4 చోట్ల అస్సలు ఇలాంటి పరికరాలు, సదుపాయాలు లేవు. మనం 16 కొత్త టీచింగ్ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటు ఉండాలనే దృక్పథంతో…
అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రాధాన్యత ఏంటి? అంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు… ప్రస్తుతం తెలంగాణలో మాజీ మంత్రి ఈటల వ్యవహారం హాట్ టాపిక్ కాగా.. ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం సంచలనంగా మారింది.. అయితే, కోవిడ్ సమయంలో.. ఈ పరిస్థితి ఏంటి? అంటూ రెండు ప్రభుత్వాలను నిలదీశారు వీహెచ్. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో రఘురామకృష్ణంరాజు, తెలంగాణలో ఈటల రాజేందర్ మీద పెడుతున్న శ్రద్ధ..…