జేసీలకు సీఎం మార్గనిర్దేశం.. పనిలో డూప్లికేషన్ ఉండకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం వైఎస్ జగన్.. వారికి మార్గనిర్దేశం చేశారు.. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లు గతంలో ఎప్పుడూ కట్టలేదని. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదన్న ఆయన.. 28 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం.. 17 వేల లే అవుట్స్‌లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం.. కొన్ని లే అవుట్స్ .. మున్సిపాల్టీల సైజులో ఉన్నాయి.. అధికారులంతా అందరికీ ఇళ్లు పథకం అమలుకోసం విశేషంగా పనిచేస్తున్నారని తెలిపారు.. అయితే, నిర్ణీత సమయాల్లోగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలన్న ఏపీ సీఎం.. అంతేకాదు అర్హులైన వారికి కచ్చితంగా అనుకున్న సమయంలోగా పట్టా ఇవ్వాలని స్పష్టం చేశారు.. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా వారికి ఇంటి పట్టాలు అందాలని పేర్కొన్న ఆయన.. శాచ్యురేషన్ పద్ధతిలో వారికి ఇంటి పట్టాలు అందించాలి.. అర్హులు 100 మంది ఉంటే.. 10 మంది ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదన్నారు.. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల సహకారంతో అర్హులైనవారికి సామాజిక తనిఖీచేసి శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వగలుగుతున్నామని.. పెన్షన్లు, ఇంటిపట్టాలు, రేషన్‌కార్డులు, ఆరోగ్య శ్రీ… రెగ్యులర్ గా సమాన్యజనంతో లింకైన అంశాలు ఇవి.. నిర్ణీత సమయంలోగా వీటికి సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించి వారికి ప్రయోజనాలు అందించాలన్నారు.
ఎవరైనా మిగిలిపోతే వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందించాలన్నారు సీఎం వైఎస్ జగన్.. ఇలా ఇళ్లపట్టాలు అందుకున్నవారికి ఇళ్లుకూడా ఇవ్వాలన్నా యన.. ప్రతి ఏటా కూడా ఇలా పట్టాలు అందుకున్నవారికి ఇళ్లుకట్టించాల్సిన అవసరం ఉంటుందన్నారు.. పేదవాడి సొంతింటికలను నిజంచేసే దిశగా అడుగులు వేస్తున్నామన్న సీఎం… దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైన అంశం.. ఇళ్లనిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మురికివాడలుగా మారొద్దని ఆదేశించారు.. అక్కడ మంచి మౌలిక సదుపాయాలను కల్పించాలి.. వివిధ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఈమౌలిక సదుపాయాలను కల్పించేలా చూడాలని.. ఇళ్లస్థలాల రూపేణా, నిర్మాణం రూపేణా, మౌలిక సదుపాయాల రూపేణా సుమారు రూ.84వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని స్పష్టం చేసిన సీఎం.. ప్రతి పనిలో కూడా పారదర్శకతను, నాణ్యతను దృష్టిలో ఉంచుకోండి.. నాణ్యత విషయలో రాజీ పడితే… ఇబ్బందులు వస్తాయని.. నిర్దేశించుకున్న సమయంలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని.. సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకుసాగాలని.. పనిలో డూప్లికేషన్ ఉండకూడదని ఆదేశించారు.
Also Read
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
తాజావార్తలు
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?