హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన… మొదటగా కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్‌తో సమావేశమయ్యారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లో భేటీ అయ్యారు.. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. కాగా, ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు 2008 డీఎస్సీ అభ్యర్థులు.నోటిఫికేషన్ విడుదల తర్వాత నిబంధనల మార్చడం వల్ల తమకు అన్యాయం జరిగిందని 11 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు 2,193 మంది అభ్యర్థులు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టటానికి అంగీకరించారు ముఖ్యమంత్రి. ఈ సందర్బంగా ఉద్యోగసంఘం నేత వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ… ఈ ఏడాది అక్టోబరు 2న రెండేళ్ళు పూర్తి చేసుకోనున్నారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరాం.…
చిరువ్యాపారుల కోసం జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కోసం రూ.370 కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు. 3.7 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. చిరు వ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, గత్యంతరం లేక వ్యాపారులు అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారనీ, వాటిని చెల్లించలేక పేదలు అష్టకష్టాలు పడుతున్నారని, వ్యవస్థలను పేదలకు ఉపయోగపడేలా తీసుకురావాలని, లేకపోతే ప్రభుత్వాలు విఫలం అయినట్టే అని…
కరోనా సమయంలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరిని ఆదుకోవడానికి సీఎం… జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులను అదుకోబోతున్నారు. చిరువ్యాపారులకు రూ.10వేల రూపాయల వడ్డీలేని రుణాలను మంజూరు చేయబోతున్నారు. తాడెపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి 11 గంటలకు వర్చువల్ విధానంలో నగదును బదిలీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ది చేకూరబోతున్నది.…
రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే పక్కాగా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబందించిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభించారు. ఇక ఇదిలా ఉంటే, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ…
కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది ఏపీ ప్రభుత్వం.. మూడో సారి వాహాన మిత్ర పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.. జులై నెలలో వాహన మిత్ర పథకం అమలు చేయాల్సి ఉన్నా.. కరోనా కష్ట కాలంలో ఆదుకునేందుకు ఈ నెలలోనే వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు మంత్రి పేర్నినాని.. ఈ నెల 15వ తేదీన వాహన మిత్ర పథకం కింద డబ్బులు జమ చేయనున్నట్టు వెల్లడించారు. అయితే; వివిధ వృత్తులకు చెందిన…
ఇల్లులేని పేదలకోసం రాష్ట్రంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో సుమారు 15 లక్షలకు పైగా గృహాలను నిర్మిస్తున్నారు. ఈ పథకం ద్వారా 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తులను కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ జగనన్న కాలనీల నిర్మాణం పనులను సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన గృహనిర్మాణ పనులను పూర్తిచేస్తామని, రాష్ట్రజనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి పక్కా ఇంటిని ఇస్తున్నామని సీఎం…
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ రోజు జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. పిటీషనర్ రాజకీయ దురుద్దేశ్యంతోనే పిటీషన్ దాఖలు చేశారని, పిటీషనర్ తన పిటీషన్లో వాడిన భాష, తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పిటీషనర్ రూ.900 కోట్లు బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడని కౌంటర్లో పేర్కోన్నారు.…