కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైయస్.జగన్ భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్ర మంత్రికి వివరించిన సీఎం… కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్‌విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారంలేకుండా చూడాలన్నారు సీఎం. అయితే ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలోనూ ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. వచ్చేవారం ఏపీ చీఫ్ సెక్రటరీ, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎంకు చెప్పిన కేంద్ర మంత్రి విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. దాదాపు గంటకుపైగా సీఎం, కేంద్ర మంత్రి మధ్య సమావేశం జరిగింది.