గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్య ఘటనపై సీఎం వైఎఎస్ జగన్ ఆరా తీసినట్టు చెబుతున్నారు. సీఎంఓ అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఈకేసులో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దిశ చట్టం కింద వెంటనే దర్యాప్తు పూర్తిచేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని సీఎం కోరారు. దోషిత్వాన్ని నిరూపించి కఠినశిక్ష పడేలా చూడాలన్న జగన్ అనూష కుటుంబానికి రూ.10…