ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈరోజు ఎస్ఎన్‌బీసీ సమావేశం జరిగింది. 2021-22 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. స్కూళ్లు, ఆసుపత్రులను నాడు-నేడు కింద అభివృద్ది చేస్తున్నామని, అగ్రి ఇన్‌ఫ్రా, గృహాలు, ఇతర వ్యవసాయ రంగాల్లో బ్యాంకుల సమర్ధత పెరగాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు తిరిగి వస్తున్నట్టు తెలిపారు. చికిత్సకోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్టు సీఎం తెలిపారు. క్లీనిక్స్ నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు అభివృద్ధి చేపట్టినట్టు సీఎం పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కొత్తగా 16 కాలేజీలను తీసుకొన్తున్నట్టు సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.