నూతన విద్యా విధానంపై సీఎం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన విద్యా విధానంతో ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎంతో మేలు జరగుతుందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. నూతన విద్యా విధానంపై చర్చించారు.. నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించిన ఆయన.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.. ఇక, ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుందని.. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్ కాలేజీలు ఉండాలని.. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు- నేడు కింద భూమి కొనుగోలు చేయాలని.. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్ దుస్తులు, షూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
స్కూళ్లు, అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.. ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదన్న ఆయన.. రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యంగా ఉండాలని.. పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగానూ ఉంటారన్నారు.. వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుంది.. ఉపాధ్యాయుడు, విద్యార్ధి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశంగా తెలిపారు.. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదన్న సీఎం.. ఫౌండేషన్ కోర్సులో ఇది చాలా అవసరం అన్నారు.. ఎన్‌ఈపీ(నేషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్) ప్రకారం నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పన మన లక్ష్యం అని స్పస్టం చేశారు. ఆ మేరకు పిల్లలకు విద్య అందించేదిగా మన విద్యా విధానం ఉండాలని.. నూతన విద్యా విధానంలో ఒక స్కూల్ మూతపడ్డం లేదని.. ఒక్క ఉపాద్యాయుడ్ని కూడా తీసేయడం లేదన్నారు.. మరోవైపు.. ఇంగ్లీషు మీడియంలో చెప్పాలని ఆరాటపడుతున్నాం.. వచ్చే సమావేశానికల్లా ఈ నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, అయ్యే ఖర్చుపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని.. జులై 1 నుంచి రెండో విడత నాడు– నేడు ప్రారంభం అవుతుందన్నారు సీఎం వైఎస్ జగన్.
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
తాజావార్తలు
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?