ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.. దాదాపుగా నామినేటెడ్ పదవుల ఎంపిక ఓ కొలిక్కివచ్చిందని… రేపే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన వస్తుందని ప్రచారం సాగుతోంది.. బుధవారం రోజు 60 నుంచి 70 వరకు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించే అవకాశం ఉండగా.. గత ఎన్నికల్లో ఓటమిపాలైన, పలు కారణాలతో టికెట్ పొందని వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్… ఇప్పటి వరకు ప్రముఖంగా వినిపిస్తున్న కొన్ని పేర్లను పరిశీలిస్తే.. వీఎంఆర్ డీఏ చైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర విద్యావిభాగం వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, నెడ్ క్యాప్ చైర్మన్‌గా కేకే రాజు, రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ ఛైర్మన్ గా దాడి రత్నాకర్, విశాఖ రీజియన్ పెట్రోకారిడార్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జీవీ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా చింతకాయల సన్యాసిపాత్రుడు, డీసీఎమ్ ఛైర్ పర్సన్ గా పల్లా చినతల్లి, రాష్ట్ర బ్రాహ్మణ విభాగం చైర్మన్ గా సుధాకర్ పేర్లు ప్రచారం ఉన్నాయని చెబుతున్నారు నేతలు.. ఇకచ, డీసీసీబీ ఛైర్మన్ గా సుకుమార్ వర్మ కొనసాగింపునకు అవకాశం ఉండగా… మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన నేతను ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు.. అయితే, ఈ ప్రచారానికి పులిస్టాప్ పడాలంటే మాత్రం… ఆ ఫైనల్ లిస్ట్ విడుదల కావాల్సిందే.