ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం… 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు సైటుకు చేరుకోనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపరిశీలన తర్వాత 12 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు సీఎం. అయితే ఈ నెల 14నే పోలవరంకి వెళ్ళాల్సి ఉన్నా… వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడింది. తాజాగా 19న వెళ్ళేందుకు ప్రణాళిక ఖరారు అయ్యింది.