ఏపీ తాలిబన్ రాజ్యంగా మారింది. పోలీసుల గన్నులు పెట్టి జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు అని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడే మహిళలకు రక్షణ లేకుండా పోయింది.ప్రతిపక్ష పార్టీగా మాకు నిరసన చేసే హక్కులేదా… నిరసనలు ,పరామర్శలు చేస్తే అరెస్టులు చేసేస్తారా అని ప్రశ్నించారు. నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలు చేసిన తప్పేంటి. అసలు రాష్ట్రంలో దిశ చట్టం ఉందా.. అమల్లోకి వచ్చిందా అని అడిగారు. ముఖ్యమంత్రికి పిచ్చిపట్టి ఏం మాట్లాడితే, వైసీపీ నేతలు కూడా అదే మాట్లాడుతున్నారు. లేని చట్టాన్ని ఉన్నట్లు మభ్యపెడుతున్న సీఎం జగన్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి అని పేర్కొన్నారు.