పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో జరిగిన సమావేశమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇక నుంచి పార్టీకే పెద్ద పీట వేస్తానని చెప్పారు. పనులన్నీ అనుకున్న సమయానికే పూర్తి కావాలని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం వైఎస్ జగన్.. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటిస్తున్నారు.. గుడ్లూరు మండలం మొండివారిపాలెంలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా రాష్ట్రాన్ని చుట్టూస్తున్నారు.. జిల్లాల్లో పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, శంకుస్థాపనలను చేయడంపై దృష్టిసారించారు.. ఇక, సొంత జిల్లాలో మరోసారి పర్యటించానున్నారు ఏపీ సీఎం.. తన పర్యటనలో ప్రొద్దుటూరులో డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరుకాబోతున్నారు.. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. Read Also: Minister Kakani: బాబుకు సవాల్.. దమ్ముంటే రైతుల…
నిన్న పదో తరగతి ఫలితాల్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే! పాస్ శాతం పక్కనపెడితే.. మార్కుల జాబితాలో కొన్ని అవకతవకలు కనిపించాయి. చాలామంది పిల్లలకు పాస్ మార్కులు రాకపోయినా, పాస్ చేసేశారు. వేరే వాళ్ళకు అంతకుమించి మార్కులు వచ్చినా (పాస్ అర్హత కంటే తక్కువే), ఫెయిల్గా ప్రకటించారు. దీంతో.. ‘‘ఏంటీ తప్పుల తడక’’ అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరీ ఇంత నిర్లక్ష్య ధోరణి ఏంటి? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా…
అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ ‘ఏపీబీ 144000’ యాప్ను లాంచ్ చేయడం మీద టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కౌంటర్లు వేశారు. మొత్తం వ్యవస్థల్నే దోచేసిన వ్యక్తి.. లంచాలు తీసుకోవడం నేరమని జగన్ మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అంటూ ఛలోక్తులు పేల్చారు. జగన్ సామాజిక న్యాయం కేవలం మాటలకే పరిమితమైందే తప్పే, ఆచరణలో శూన్యమన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ దోచుకున్నారని, ఇప్పుడు తాను అధికారంలో…
బీహార్లోని పశువుల దాణా కుంభకోణం తరహాలోనే ఏపీ ప్రభుత్వం మూగజీవాల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర వ్యాఖ్యనించారు. ఆర్బీకేల ద్వారా వల్లభ ఫీడుని అమ్ముడుతున్నారని, అది ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిది కాదా? అని ప్రశ్నించారు. ఫెర్టయిల్ గ్రీన్ అనే కంపెనీ ద్వారా పశువుల మేత కోసం వినియోగించే టీఎంఆర్ను మెట్రిక్ టన్ను రూ. 16 వేలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. వెటర్నరీ డాక్టర్లకు టార్గెట్ పెట్టి మరీ.. ఆ కంపెనీ సరఫరా…