Bonda Umamaheswara Rao Fires On Gorantla Madhav Video Call Issue: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారం మీద టీడీజీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు తీవ్రంగా స్పందించారు. వైసీపీ ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరు అసహ్యించుకునేలా ఉందని మండిపడ్డారు. సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు గురి చేస్తోన్న వీడియో వైరల్ అవుతున్నప్పటికీ.. గోరంట్ల మాధవ్ బుకాయిస్తున్నాడని ఆగ్రహించారు. ‘గోరంట్ల మాధవ్ చేసింది తప్పు, అతనిపై చర్యలు తీసుకోండి’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేయగలడా? అని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్‌పై ఇదివరకే అత్యాచారం, హత్యాయత్నం కేసులున్నాయని.. మహిళలపై వేధింపులు, అత్యాచార యత్నాలు చేసిన వారికి సీఎం జగన్ మంత్రి పదవులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
మహిళా వాలంటీర్లను లైంగిక వేధింపులకు గురి చేసినా.. జోగిరమేష్ కు జగన్ మంత్రి పదవి ఎంతవరకు సమంజసమని బోండా ఉమా కడిగి పారేశారు. ఎన్టీరామారావు కుమార్తె ఉమామహేశ్వరి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని వైసీపీ నేతలు చూశారన్నారు. గుండెపోటు అని ఒకసారి, లేదు లేదంటే మార్డర్ అంటూ మరోసారి చెప్పగలిగే వ్యక్తి ఒక్క విజయసాయికి ఉందని సెటైర్ వేశారు. చీడపురుగు లాంటి లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్‌ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇలాంటి పనులు చేసినందుకే.. ఆనాడు అందరూ కలిసి తన్ని తరిమేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని లక్ష్మీ పార్వతికి సూచించారు. తన పేటీఎం కుక్కలతో దేవేందర్ రెడ్డి ట్వీట్లు చేయడం, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం మానేయాలన్నారు. జగన్ బాబాయిని చంపి మూడేళ్లయినా, హంతకుల్ని ఇంకా పట్టుకోలేదని, వారిని పట్టుకోవాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.