Ayyannapatrudu Responds On MP Gorantla Madhav Video Call Controversy: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ఇదంతా టీడీపీ కుట్రేనని, తనని అప్రతిష్టపాలు చేసేందుకు వీడియోల్ని మార్ఫింగ్ చేశారని మాధవ్ మండిపడ్డారు. ఇందులో అయ్యపాత్రుడు పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ.. తనకు ఆ మార్ఫింగ్ వీడియోలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాధవ్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటారో, ఇంకేమైనా చేసుకుంటారో చేసుకోండని అన్నారు. ‘‘మీ చేతిలో పోలీసులు, అధికారం ఉంది.. ఎటువంటి ఎంక్వయిరీకి అయినా రెడీ’’ అని తేల్చి చెప్పారు.
అంతేకాదు.. ఎన్టీఆర్ కుటుంబంపై ఎంపీ విజయసాయి రెడ్డి విపరీతమైన వ్యాఖ్యలు చేశారని, వెబ్‌లో మాట్లాడినందుకే తనపై 14 కేసులు పెట్టారని, అలాంటిది బహిరంగంగా మాట్లాడిన విజయసాయిపై ఎందుకు కేసు పెట్టడం లేదని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. నందమూరి కుటుంబ సభ్యుల జోలికొస్తే.. 150 కాదు కదా, ఒక్క సీట్ కూడా వైసీపీకి రాదన్నారు. జగన్మోహన్ రెడ్డిలా నందమూరిది దోచుకునే కుటుంబం కాదన్నారు. దొంగ సర్వే నెంబర్‌లు పెట్టి బురద జల్లారని ఆగ్రహించారు. పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని అప్పట్లో వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల తర్వాత అసలు పింక్ డైమండే లేదని మాట మార్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుని చూసి వైసీపీ భయపడుతోందని, అందుకే ఇలాంటి పనులకు ఆ పార్టీ నేతలు పాల్పడుతున్నారని అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు.