సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు.. ఎన్ని ఇబ్బందులున్నా.. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉంది.. ఇచ్చిన మాట ప్రకారం.. ముందు ప్రకటించిన సంక్షేమ పథకాలకు నగదు విడుదల చేస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మరో పథకానికి సంబంధించి ఆర్థిక చేయూతకు రంగం సిద్ధం చేశారు.. జగనన్న తోడు–చిరు వ్యాపారుల ఉపాధికి ప్రభుత్వం ఆర్ధిక చేయూత పథకంలో భాగంగా ఈ రోజు చిరు వ్యాపారులకు ఆర్థికసాయం చేయనున్నారు.. చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా 395 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్..
Read Also: Dr BR Ambedkar Konaseema: ఇక, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ.. గెజిట్ విడుదల..
మొత్తంగా, గత ఆరు నెలలకు సంబంధించిన రూ. 15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పూర్తి వడ్డీ భారం భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేల ఆర్ధిక సహాయం అందిస్తున్నారు.. ఇవాళ 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 15,03,558 లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 2,011 కోట్లుకు చేరుకున్నట్టు అవుతుంది.. కాగా, పల్లెల్లో, పట్టణాల్లో వీధి వ్యాపారాలు చేసుకునేవారికి ఆర్థికంగా చేయూత అందించడానికి జగనన్న తోడు పథకాన్ని 2020లోనే ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం.. మిగతా పథకాల లాగే ఈ పథకం కూడా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు..