Chandrababu Naidu: నేను చేసి చూపిస్తా.. సీఎం జగన్‌కు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Naidu Challenges On Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారంపై మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు కేంద్రం పేరు చెప్పి జగన్ చేతులెత్తేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వడం లేదన్నారు. ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం చేతకాకపోతే, జగన్ రాజీనామా చేయాలన్నారు. పోలవరం ఎందుకు పూర్తి కాదో తాను చూస్తానన్నారు. పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే.. వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు.
మూడేళ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ముంపు బాధితులకు రూ. 20 వేల కోట్లు ఇవ్వలేదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల ముందు పోలవరం బాధితులకు రూ. 10 ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేశారన్నారు. ముంపు వల్ల వేలాది కుటుంబాలు నష్టపోయాయని, జగన్ సర్కార్ బాధితుల బతుకులను గోదావరిలో ముంచుతోందని మండిపడ్డారు. జగన్ రోడ్డు మార్గాన వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోకుండా, హెలికాప్టర్లలో వచ్చి వెళ్లారన్నారు. ఎన్నికలకు ముద్దులు పెట్టిన జగన్.. ఇప్పుడు పిడుగుద్దులు గుద్దుతున్నారన్నారు. మాయమాలు చెప్పిన అధికారంలోకి వచ్చిన సీఎంకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కలెక్టర్లకు సీఎం 100 మార్కులేస్తారేమో గానీ, ప్రజలు మాత్రం సీఎంకి వేసిది సున్నా మార్కులని చంద్రబాబు చెప్పారు. కాగా.. రెండు రోజుల ముంపు ప్రాంతాల పర్యటనను చంద్రబాబు పూర్తి చేసుకున్నారు. వి.ఆర్. పురం రేఖపల్లిలోని వరద బాధిత ప్రాంతంలో బాధితులను ఓదార్చి, తన పర్యటనని ముగించుకున్నారు. భద్రాచలం మీదుగా గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు బయలుదేరారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!