Nadendla Manohar: ఆరు వేల కోట్లు స్వాహా.. వాటి లెక్కలెక్కడ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar Reveals Secrets Of SDC: రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ ద్వారా అభివృద్ధి చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం.. ఆ కార్పొరేషన్ ద్వారా అప్పులు చేస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎస్డీసీ ద్వారా తెచ్చిన రుణాల్లో సుమారు రూ. 6 వేల కోట్లు పక్కకు మళ్లించారని ఆరోపించిన ఆయన.. ఆ అప్పుల వినియోగం లెక్కలెక్కడ? అని నిలదీశారు. 2020లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ సీబీఐ దత్తపుత్రుడు (సీఎం జగన్‌ని ఉద్దేశించి) ఏపీ అభివృద్ధి కార్పోరేషన్ (ఎస్‌డీసీ) మొదలుపెట్టారని.. ఏర్పాటు విషయంలోనే దీనికి కేంద్రం అభ్యంతరం తెలిపిందన్నారు. మాజీ సీజేఐ ద్వారా ఎస్‌డీసీకి చట్టబద్దత ఉందని కేంద్రాన్ని మభ్య పెట్టేలా చెప్పించారని.. అది రాజ్యాంగ విరుద్ధమని పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన చేసిందని గుర్తు చేశారు. ఎస్‌డీసీకి రుణాలు ఇవ్వొద్దని బ్యాంకర్లను కేంద్రం హెచ్చరించిందని కూడా తెలిపారు.
అయితే.. కేంద్రం ఆ ప్రకటన చేసేలోపే ఏపీ ప్రభుత్వం రూ. 23 వేల కోట్లను ఎస్‌డీసీ ద్వారా అప్పులు చేసిందని నాదెండ్ల పేర్కొన్నారు. అందులో నుంచి అమ్మఒడి, చేయూత, ఆసరా కోసమంటూ రూ. 17 వేల కోట్లకు పైగా మొత్తాన్ని వాడేశారన్నారు. మిగిలిన ఆరు వేల కోట్ల లెక్కలు మాత్రం లేవన్నారు. మద్యం ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ. 25 వేల కోట్లు ఆదాయం వస్తోందని.. చేసిన అప్పులతో పాటు వస్తోన్న ఆయాన్ని ఏం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎస్‌డీసీని కేవలం అప్పులకే పరిమితం చేశారన్నారు. ఏపీలో జరుగుతోన్న ఆర్ధిక అవకతవకలపై కేంద్రం స్పందించడంతో పాటు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ ఒత్తిడి ఫలించిందని, అందుకే దాని ప్రైవేటీకరణ అంశం నెమ్మదించిందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!