ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు మారడం లేదు. వనస్థలిపురం గుర్రంగూడ వద్ద కారు బీభత్సం సృష్టించింది. యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టి డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టి బోల్తా పడింది థార్ కారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. థార్ కారు ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Also…
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గత సోమవారం మధ్యాహ్నం కాలేజ్ నుంచి తిరిగి వస్తున్న విద్యార్థినిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విద్యార్థినిని మార్గమధ్యంలో వదిలి నిందితులు పరారయ్యారు.
ప్రపంచంలో చాలా మంది జనాలు ప్రీడయాబెటిస్ సమస్యతో పోరాడుతున్నారు. బ్లడ్ షుగర్ సాధారణ స్థాయి కంటే పెరగడాన్ని ప్రీడయాబెటిస్ అంటారు. మరోవైపు ఈ వ్యాధిని యువత కూడా ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు. ప్రీడయాబెటిస్ వల్ల గుండె జబ్బులు, పక్షవాతం మరియు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. శివుడికి మొక్కుబడి ఉందని గంగాజలం కోసమని వెళ్లి ముగ్గురు యువకులు నదిలో మునిగిపోయారు. అసన్‌సోల్‌లో జరిగిన ఘటనలో ఒకరు గల్లంతు కాగా.. ముర్షిదాబాద్‌లోని బహరంపూర్‌లో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
వరల్డ్ వైడ్ గా ఎక్కువ మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమని అనేక సర్వేలు తెలుపుతున్నాయి. అలాగే ఐదేండ్లుగా భారత్ లో కూడా హార్ట్ ఎటాక్ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ ఇప్పుడు 30-40 ఏండ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్కరకి గుండెపోటుతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
బయటి ప్రపంచానికి తెలియాలంటే వెంటనే గుర్తొచ్చేది సోషల్ మీడియా. అందులోనూ రీల్స్ చేస్తే బయటి ప్రపంచానికి త్వరగా తెలుస్తామని నేటి యువత రీల్స్ మోజులో పడిపోయింది.
ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువకుడు ట్రైన్ డోర్‌ను కాళ్లతో అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనాలు, కాంప్లెక్స్‌లతో లిఫ్ట్ మాదిరిగానే ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ మెట్రో ట్రైన్‌లోనూ ఉంటుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయడానికి మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది. అయితే ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు ఆకతాయి యువకులు రూల్స్ ను బ్రేక్ చేశారు.
ఇప్పుడు హెడ్‌ఫోన్స్ ఓ ట్రెండ్‌గా మారిపోయింది.. హెడ్‌ఫోన్స్, ఇయర్‌బర్డ్స్ ఇలా రకరకాల పరికరాలను చెవుల్లో పెట్టుకుని భారీ శబ్దాలతో సినిమాలు చూస్తున్నారు, మ్యూజిక్ ఆశ్వాదిస్తున్నారు.. పక్కనవారు ఏమైనా మాట్లాడినా? ఏదైనా చెప్పినా కూడా వినిపించకపోవడంతో.. పట్టించుకోవడం లేదు.. అలా మారిపోయింది పరిస్థితి.. అయితే, హెడ్‌ఫోన్స్, ఇయర్‌బర్డ్స్ వంటివి వాడడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి వినికిడి ముప్పు పొంచిఉన్నట్టు ఓ అధ్యయనం తేల్చింది.. ప్రపంచ వ్యాప్తంగా కొన్నేళ్లుగా హెడ్‌ఫోన్లు, ఇయర్ బర్డ్స్ లాంటివి వాడుతూ.. పెద్ద శబ్దాలతో…
దేశంలోని యువతకు గుండెపోటు టెన్షన్ పట్టుకుంది. గుప్పెడంత గుండె చిన్న వయసులోనే ముప్పుకు గురవుతోంది. దక్షిణాసియా దేశాల్లోని 7 శాతం జనాభాకు గుండెపోటు భయం వెంటాడుతోంది. వీరిలో ఎక్కువగా భారతీయులే ఉండటం కలవరపెడుతోంది. అయితే మహిళల కంటే పురుషుల్లోనే గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటోందని ఇటీవల ఓ సర్వేలో స్పష్టమైంది. గుండె జబ్బుల ముప్పు మగాళ్లలో 21.4 శాతం, మహిళల్లో 12.7 శాతంగా ఉందని తేలింది. ఫిట్‌గా ఉన్నా కొంచెం ఫ్యాట్ ఎక్కువైనా గుండెపోటు వస్తుండటంతో ఏం…
మనదేశంలో ఉమ్మడి కుటుంబాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. తల్లీదండ్రులు, కొడుకు, కోడలు, వారి పిల్లలు ఇలా ఉమ్మడి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కరోనా కారణంగా చాలామంది నగరాల నుంచి తిరిగి గ్రామాలకు వలస వెళ్లిపోయారు. ఉద్యోగాలు కోల్పోవడంతో గ్రామాల్లో తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నారు. మనదేశంలో 30 ఏళ్లు దాటిన లక్షలాది మంది యువత ఇప్పటికీ తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, స్పెయిన్‌లోని ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లి…