ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గత సోమవారం మధ్యాహ్నం కాలేజ్ నుంచి తిరిగి వస్తున్న విద్యార్థినిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విద్యార్థినిని మార్గమధ్యంలో వదిలి నిందితులు పరారయ్యారు. రోడ్డుపై పడి ఉన్న విద్యార్థిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అయితే ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వారిని అరెస్ట్ చేశారు.
Viral Video : వాట్ ఏ టాలెంట్ గురూ.. నాలికతో గీసిన అద్భుతమైన కోహ్లీ చిత్రం..
వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థిని కాలేజ్ నుంచి అయిపోయాక ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆస్రా ఖేదీకి చెందిన ఇద్దరు యువకులు కలిశారు. అయితే తాము మీ గ్రామానికి వెళ్తున్నామని.. బైక్ పై డ్రాప్ చేస్తామని విద్యార్థినితో చెప్పారు. అయితే బైక్ పై కూర్చున్న విద్యార్థిని.. వెళ్లే రూట్ లో కాకుండా, వేరే రూట్ లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. ఆ తర్వాత ఈ ఐదుగురు యువకులు కలిసి ఒకరి తర్వాత ఒకరు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
Singareni : సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు గుడ్ న్యూస్
అయితే ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని.. చెబితే చంపేస్తామని విద్యార్థినిని యువకులు బెదిరించారు. ఆ తర్వాత మార్గమధ్యలో పడేసి వారు పారిపోగా.. అటుగా వెళ్తున్న స్థానికులు విద్యార్థిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసుల విచారణలో అమన్, అంకుర్‌లతో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని విద్యార్థిని తెలిపింది. విద్యార్థినిని విచారించిన పోలీసులు.. అమన్, అంకుర్, మరో ముగ్గురు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Kodali Nani and Vangaveeti Radha: కొడాలి నాని, పార్థ సారథి, వంగవీటి రాధాకు అరెస్ట్ వారెంట్..
విద్యార్థిని ఫిర్యాదు మేరకు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సహరాన్‌పూర్ ఎస్‌ఎస్పీ డాక్టర్ విపిన్ తడా తెలిపారు. దీంతో పాటు నిందితులందరిపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు నిందితులకు వీలైనంత త్వరగా చట్టపరమైన కఠిన శిక్షలు పడతాయని ఎస్‌ఎస్పీ తెలిపారు.