Reels: రీల్స్ మోజులో ప్రాణాలు పొగొట్టుకున్న యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reels: బయటి ప్రపంచానికి తెలియాలంటే వెంటనే గుర్తొచ్చేది సోషల్ మీడియా. అందులోనూ రీల్స్ చేస్తే బయటి ప్రపంచానికి త్వరగా తెలుస్తామని నేటి యువత రీల్స్ మోజులో పడిపోయింది. యువతే కాదు.. అన్ని వయస్సుల వారు.. ఆడ, మగ అని తేడా లేకుండా.. వయస్సుతో సంబంధం లేకుండా రీల్స్ చేస్తున్నారు. అయితే రీల్స్ చేసే టైంలో కొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. కొందరు ఏకంగా ప్రాణాలనే పొగొట్టుకుంటున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. అటువంటి సంఘటనే మహారాష్ర్టలో జరిగింది. రీల్స్ కోసం పాతబడిన బావిపైకి ఎక్కి రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు భావిలోపడి మరణించాడు. 32 గంటల తరువాత శవాన్ని బయటికి తీశారు పోలీసులు.
Read also: Avika Gor : సల్మాన్ ఖాన్ చిత్రం నుంచి అవికాను అందుకే తీసేశారట
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఓ ప్రమాదక స్టంట్ చేశాడు ఆ యువకుడు. సాగరసంగమం సినిమాలో కమల్ హాసన్ మాదిరి బావిపైకి ఎక్కి.. స్టెప్పులేస్తూ.. రీల్స్ చేయబోయాడు… కానీ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మహారాష్ట్రలోని డోంబివిలీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని డోంబీవలీ పరిధిలోని ఠాకురలీ ప్రాంతానికి చెందిన 18 సంవత్సరాల బిలాల్ సోహేల్ షేక్ అనే టీనేజర్ కు రీల్స్ అంటే తెగ పిచ్చి. సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ కావాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. రకరకాల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో జూన్ 11 న తన సోషల్ మీడియా ఖాతా కోసం రీల్ షూట్ చేయడానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ముంబ్రాలోని చాంద్‌నగర్ సమీపంలోని బ్రిటీష్ కాలం నాటి పంప్ హౌస్‌కు అనుసంధానంగా ఉన్న బావి వద్దకు వచ్చాడు. అనంతరం బావిపై స్టెప్పులేస్తూ.. రీల్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో ప్రమాదశాత్తువు ఆ యువకుడు బావిలో పడి చనిపోయాడు. దాదాపు 32 గంటల తర్వాత పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.
Read also: IIIT Student: ట్రిపుల్ ఐటీ విద్యార్థినిల మరణాలు.. వీసీ వెంకట రమణ క్లారిటీ
ఈ కేసు గురించి విష్ణునగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పండినాథ్ భలేరావు మాట్లాడుతూ.. బిలాల్ బావిలో పడిపోవడాన్ని చూసిన ఇద్దరు స్నేహితులు సహాయం కోసం సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లారని తెలిపారు. దీంతో గార్డు విష్ణు నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి వెంటనే వెతుకులాట ప్రారంభించాడు. ముంబ్రాలోని చాంద్‌నగర్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. మృతి సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పంప్ హౌజ్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. డోంబివిలి అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ.. తమ బృందం బాలుడి మృతదేహం కోసం ఒకరోజుకు పైగా వెతికిందని.. ఘటన జరిగిన 32 గంటల తర్వాత జూన్ 12 సాయంత్రం అతడి మృతదేహం లభ్యమైందని తెలిపారు. చాంద్‌నగర్ వాసులు బిలాల్‌ను రీల్ స్టార్‌గా చూశారని పోలీసులు తెలిపారు. దుర్ఘటనపై బిలాల్ మామ ఖలీద్ మాట్లాడుతూ బిలాల్ తన హితులతో కలిసి ఠాకూర్లీకి వెళ్తున్నట్లు మాతో చెప్పాడు. రాత్రికి ఇంటికి తిరిగి వస్తాడని అనుకున్నాం. ఆ తర్వాత అతని స్నేహితులు ఈ సంఘటన గురించి చెప్పినప్పుడు, మేము షాక్ అయ్యాము. తన కుటుంబం పడుతున్న బాధను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని .. అతను ఈ లోకంలో లేడని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామన్నారు.
- Tags
- ACCIDENT
- life
- police
- reels
- Young People
తాజావార్తలు
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!