ప్రపంచంలో చాలా మంది జనాలు ప్రీడయాబెటిస్ సమస్యతో పోరాడుతున్నారు. బ్లడ్ షుగర్ సాధారణ స్థాయి కంటే పెరగడాన్ని ప్రీడయాబెటిస్ అంటారు. మరోవైపు ఈ వ్యాధిని యువత కూడా ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు. ప్రీడయాబెటిస్ వల్ల గుండె జబ్బులు, పక్షవాతం మరియు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం ముప్పును దూరం చేసుకోవచ్చు. అయితే యువత ప్రీడయాబెటిస్ను ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Minister Srinivas Goud: నేను ఎలాంటి వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేయలేదు..
అయితే డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి.. ముందుగా ఆహారశైలిని మార్చుకోండి. మీరు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకుంటే వెంటనే దానిని ఆపండి. అధిక చక్కెర పదార్థాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ ఆహారంలో వీలైనంత వరకు మిల్లెట్లు అంటే తృణధాన్యాలు, పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలను తినేందుకు ప్రయత్నించండి. అంతేకాకుండా రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయమం తప్పనిసరిగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడమే కాకుండా ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.
President Of India: టైమిచ్చిన రాష్ట్రపతి.. రేపు ఉదయం కలవనున్న ఇండియా ఎంపీలు
ధూమపానం క్యాన్సర్‌ను మాత్రమే కాకుండా మధుమేహ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ధూమపానం మధుమేహం ప్రమాదాన్ని దాదాపు 40 శాతం పెంచుతుంది. దీనితో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకోసం ధుమపానం అలవాటును మానుకోండి. అంతేకాకుండా.. రోజుకు సరిపడ నిద్ర పోవాలి. 7 నుండి 8 గంటల నిద్ర పోతే మంచిది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది డయాబెటిస్ మరియు ప్రీ-డయాబెటిస్‌కు దారితీస్తుంది. ప్రీడయాబెటిస్ అనే వ్యాధి.. అధిక బరువు ఉన్న వ్యక్తులకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తల్లిదండ్రులకు లేదా తోబుట్టువులలో టైప్ 2 మధుమేహం ఉన్నట్లైతే వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు శారీరక శ్రమను తగ్గించే వ్యక్తులకు వస్తుంది.