Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వీధుల్లో, రోడ్లపై నమాజ్ చేయడంపై నిషేధం విధించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో మీరట్, సహారన్‌పూర్, మొరాదాబాద్‌లలో అనేక చోట్ల ముస్లింలు పోలీసులతో వాగ్వాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
UP Bans Meat Sale: యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల చైత్ర నవరాత్రి పండగ సందర్భంగా, మతపరమైన ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిలో మాంసం అమ్మకాలను నిషేధించింది. అక్రమ వధశాలలను మూసేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజులన రాష్ట్రవ్యాప్తంగా మాంసం అమ్మకాలపై పూర్తి నిషేధం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. Read Also:…
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో బుధవారం ఆగ్రా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఆగ్రాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన యోగి, తర్వాత వేరే విమానంలో లక్నో చేరుకున్నారు.
Ajey-The Untold Story of a Yogi: మన దేశంలో పలువురు రాజకీయ నేతలు, క్రీడాకారుల జీవిత నేపథ్యం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. మరో రాజకీయ నాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా మరో సినిమా తెరకెక్కింది. ఉత్తర్ ప్రదేశ్ సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ‘‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’’ అనే టైటిల్ తో సినిమా రూపొందించేందుకు రంగం సిద్ధమైంది.
Yogi Adityanath: మసీదులు, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి బీజేపీ చేస్తున్న పనులపై ప్రతిపక్షాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వక్ఫ్ పేరుతో వారు ఎంత భూమిని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు..? వారు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు..? అని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తుల్ని వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారని, కొన్ని ఆస్తుల్ని వేరే వ్యక్తులకు విక్రయించడంతో ఇది వివాదానికి దారి…
ముస్లింల భద్రతపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారని ఆయన అన్నారు. వార్తా సంస్థ ఏఎన్‌ఐ పాడ్‌కాస్ట్‌లో “మీ రాష్ట్రంలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారా?” అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారని అన్నారు. హిందువులు సురక్షితంగా ఉంటే.. ముస్లింలు కూడా సురక్షితంగా ఉంటారని చెప్పారు.100 ముస్లిం కుటుంబాలు ఉన్న ప్రాంతంలో ఒక్క హిందు కుటుంబం, లేదా 50 హిందూ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయా?…
Yogi Adityanath: హోలీ పండగ వేళ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం మాట్లాడుతూ.. సనాతన ధర్మం గొప్పతనాన్ని వివరించారు. ప్రపంచంలో మరే దేశానికి లేదా మరే మతానికి ‘‘సనాతన ధర్మం’’ వంటి గొప్ప పండగలు, వేడుకల సంప్రదాయం లేదని ఆయన అన్నారు. గోవధదారులకు మద్దతు ఇచ్చిన వారు, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా నేడు హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జనాల మధ్య పండుగను ఘనంగా జరుపుకున్నారు.
Yogi Adityanath: హిమాలయ దేశం నేపాల్లో రాజరిక పాలన కోసం ప్రజలు గళమెత్తుతున్నారు. మాజీ రాజు జ్ఞానేంద్ర కోసం ప్రజలు ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. నేపాల్లో ప్రజాస్వామ్యం వద్దని, మళ్లీ రాజరికం కావాలని కోరడం సంచలనంగా మారింది. అయితే, మార్చి 10న రాజు జ్ఞానేంద్రకు అనుకూలంగా త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జ్ఞానేంద్రతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Yogi Adityanath: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పోలీస్ అధికారి హోలీ, శుక్రవారం నమాజ్ గురించి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అయితే, ఆ పోలీస్ అధికారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మద్దతుగా నిలిచారు. అధికారి వ్యాఖ్యల్ని సీఎం యోగి సమర్థించారు. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది. కానీ శుక్రవారం నమాజ్ ప్రతీ వారం ఉంటుంది. ఒక వ్యక్తి మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఒకవేళ వెళ్లాల్సి వస్తే అతడికి రంగులతో సమస్య ఉండకూడదు’’ అని…