మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రెండు వైపులా.. రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు మంత్రులను పోటీలో పెట్టి తనకు పరీక్ష పెట్టారని తెలిపారు. మంత్రులిద్దరు గెలిస్తే బాగానే ఉంటుంది.. ఓడితే మాత్రం బాలినేని ఓడించాడు.. ఏదో ఫిట్టింగ్ పెట్టాడు అంటారని అన్నారు. తాను ఏదైనా చేయాలనుకుంటే పార్టీ బయటకు వెళ్లి చేస్తానే తప్ప.. పార్టీలో ఉండి ఏది చేయనని తెలిపారు. వైఎస్సార్ తమకు ఒకటే నేర్పించాడని.. పార్టీలో ఉండి ద్రోహం చేస్తే తల్లి పాలు త్రాగి మోసం చేసినట్లేనని చెప్పాడన్నారు.
Read Also: AP News: రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు..
పార్టీలో ఉండి ఎవరు తప్పు చేయకూడదు.. రాజశేఖర్ రెడ్డి నేర్పిన రాజకీయమే నేను చేస్తానని బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో మంత్రి సురేష్ ని గెలిపించాలని ఆయన కోరారు. తాను బయట ఒకటి.. లోపల ఒకటి మాట్లాడనని అన్నారు. తన గుండెల నుంచి వచ్చే మాటలే మాట్లాడుతానని చెప్పారు. అందరూ కలసికట్టుగా పనిచేయాలి.. సీఎం జగన్ నాయకత్వంలో అన్నీ నియోజకవర్గాల్లో గెలవాలని ఆయన కోరారు. రెండు నెలలు కష్టపడితే ఆ తర్వాత మీకోసం మేము చేయాల్సిన పనులు చేస్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
Read Also: EC: తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ చర్యలు..