విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. నున్న గ్రామంలో నూతనంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో అధికార ప్రభుత్వ నాయకులు తెలుగు భాషను కు.ని చేసి బూతులు మాట్లాడం బాధాకరం అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉద్యోగ కల్పనా కల్పించక పోగా యువతను తప్పు దారిలో నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని…
Rajahmundry MP Margani Bharath Comments: గుంటనక్కలు కాసుకుని కూర్చున్నారని, ప్రజలు గమనించి ఓటేయాలని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రేపు రాజమండ్రిలో లోకల్గా సిద్దం కార్యక్రమాన్ని సుబ్రమణ్యం మైదానంలో ఏర్పాటు చేశామని, రాజమండ్రి ప్రజల అభివృద్ధికి తాము సిద్దం అని అన్నారు. 10 వేల మందితో సిద్దం సభ జరగబోతోందన్నారు. రాజమండ్రిలో టీడీపీ చేసిన ఒక అభివృద్ధి చెప్తారా?, 16 ఏళ్లు పదవిలో ఉండి ఏ సాధించాలో చెప్పాలి అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు.…
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 2014లో వంద పేజీల మానిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని, ఎన్నికలు పూర్తవగానే ఆ మానిఫెస్టోను వెబ్ సైట్ నుండి తొలగించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. అయన ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తారా? అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. Also Read: Kakani Govardhan…
సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వదిలి కుప్పంకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సొంత ప్రాంతంలో గెలవలేని వ్యక్తి.. వైసీపీ నేతలను మాత్రం ఇక్కడ తంతే అక్కడ పడ్డారని విమర్శిస్తున్నారు అని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత ప్రాంతం ఏది, గాజువాకకు ఎందుకు వెళ్లారు? అని మంత్రి కాకాణి ప్రశ్నించారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పు లేకుండా ఉన్నాడని, సొంతంగా రాలేక అందర్నీ కలుపుకొని ఎన్నికలకు…
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై (Gorantla butchaiah chaudhary) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chelluboina venugopal) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందే బుచ్చయ్య చౌదరి ఓటమిని అంగీకరించారని వ్యాఖ్యానించారు.
నేడు బీజేపీ తొలి జాబితా.. లిస్ట్లో మోడీ, అమిత్ షా! పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రచారాలు కూడా మొదలెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో త్వరలోనే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశం అయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము…
Jagananna Vidya Deevena Funds Released: శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. సీఎం జగన్ బటన్ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్ ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన నిధులను బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు…