ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ‘సిద్ధం’ సభ నిర్వహించనుంది. అందుకు సంబంధించి భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను మంత్రి విడదల రజని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మూడు ‘సిద్ధం’ సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి విడదల రజని అన్నారు. మూడు సభలకు మించిన రెస్పాన్స్ ప్రజల నుంచి మేదరమెట్ల సభకు రానుందని తెలిపారు. సీఎం జగన్ పాలనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని.. రాష్ట్రంలో అన్ని వర్గాలకు జగన్ న్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రజలు తమకు మంచి చేస్తున్న నాయకుడికి అండగా ఉండాలని ఫిక్స్ అయ్యారని తెలిపారు.
Read Also: Chandrababu: ఈ నెల 17న ఏపీకి ప్రధాని మోడీ.. బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచన
సీఎం జగన్ ఒంటరి గానే పోటీకి సిద్ధమయ్యారని మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారు.. ఆయన మీద ప్రజలకు విశ్వాసం ఉందని చెప్పారు.. మిగతా అన్ని పార్టీలు ఒకవైపు.. సీఎం జగన్ మరోవైపు అని అన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి నినాదంతో మేము ప్రజలను ఓట్లడుగుతాము.. ఓటమి భయంతోనే చంద్రబాబు పొత్తుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయాలు అందరికీ తెలుసు.. రాష్ట్ర ప్రజలు మరోసారి చంద్రబాబును నమ్మే స్థితిలో లేరని మంత్రి దుయ్యబట్టారు.
Read Also: Amit Shah: రాహుల్‌ని ప్రధాని చేయడమే సోనియాగాంధీ లక్ష్యం.. కాంగ్రెస్ పేదలకు చేసిందేం లేదు..