టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిస్తే తప్ప పోటీ ఇవ్వలేమని తెలిసి రాజకీయ పార్టీలు అన్నీ ఏకం అయ్యాయని విమర్శించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని దుయ్యబట్టారు. మేలు చూసి ఓటేయమని ముఖ్యమంత్రి అడుగుతుంటే.. పొత్తు చూసి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. KA పాల్ తప్ప అందరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.
Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్ పై అనన్య నాగళ్ల సంచలన వ్యాఖ్యలు
మేం ఎన్నికలకు సిద్ధం అంటుంటే.. పొత్తుల కోసం అమిత్ షా ఇంటి ముందు మేం సిద్ధం అని పవన్, చంద్రబాబు నిలబడ్డారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. పొత్తుల తెరపైకి ఇప్పుడు మూడో కృష్ణుడిని తెచ్చారు.. బీజేపీకి వైసీపీకి సంబంధాలు ఉన్నాయని ప్రజలను నమ్మించే తప్పుడు ప్రచారం టీడీపీ చేసిందని అమర్నా్థ్ తెలిపారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సంబంధాలు తప్ప అక్రమ రాజకీయ సంబంధాలు తమ పార్టీకి అవసరం లేదని పేర్కొన్నారు. తెరవెనుక మిత్రులు ఎవరో ఇప్పుడు తేలిపోయిందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. బీజేపీ పొత్తులపై టీడీపీ, జనసేన ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ప్రత్యక్షంగా బీజేపీతో, పరోక్షంగా కాంగ్రెస్ తో సంబంధాలు కొనసాగించడం చూస్తేనే మీ ఓటమి అర్థం అయ్యిందని ఆరోపించారు. తెలుగువారి ఆత్మ గౌరవం ఢిల్లీ రోడ్లపై పెట్టినప్పుడే టీడీపీ, జనసేన పరిస్థితి అర్థం అయిందని మండిపడ్డారు. చంద్రబాబుకు వయసురీత్యా అవసరం అయిన ఊతకర్ర లాంటిదే ఇప్పుడు పొత్తు అని విమర్శించారు.
Tamannah Bhatia : శివరాత్రి పర్వదినాన శివుడి సేవలో లీనమైన స్టార్ హీరోయిన్స్..
పవన్ కళ్యాణ్ వైఖరిపై జనసేన నాయకత్వం ఆలోచించుకోవాలని మంత్రి తెలిపారు. 2019ఎన్నికల ఫలితాలు పవన్ కళ్యాణ్ విషయంలో పునరావృత్తం అవుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు.. పంచుకోవడం, పోటీ చేయడం మాకు అసందర్భమన్నారు. రాష్ట్రంలో అన్ని పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ముద్రగడ మనస్తత్వం మాకు తెలుసు.. ఆయన ఏదీ ఆశించి రాజకీయాలు చేస్తారని అనుకోనన్నారు. వచ్చే ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య జరుగుతాయి.. మా సోషల్ ఇంజినీరింగ్ మాకు వుంది.. మేము దానిని ఫాలో అవుతామని మంత్రి తెలిపారు. కాపులు డిమాండ్ల పరిష్కరించడంలో హామీ ఇచ్చి చంద్రబాబు చేయలేదు.. మేం ఎక్కువ మేలు చేశామని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.