ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 2019 జూలై 29 న అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు టీడీపీ మద్దతు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. టీడీపీ తరఫున పయ్యావుల కేశవులు అసెంబ్లీలో మాట్లాడి మద్దతు ఇచ్చారని తెలిపారు.
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానెల్స్, సోషల్ మీడియాలో తన రెండో అల్లుడు, డాక్టర్ గౌతమ్ తన మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ చేశాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
నేను కులాలను కలిపేవాడిని, పార్టీలను కలిపేవాడిని, కుటుంబాలను వేరు చేస్తానా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్పా వేరు చేయనని స్పష్టం చేశారు.
ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేయమని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దూలం నాగేశ్వరరావు మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతున్నానని తెలిపారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి వచ్చని కేంద్ర హోం మంత్రి ఆధారాలు లేకుండా వైసీపీ, జగన్ పై ఆరోపణలు చేశారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
సీఎం సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని.. ఎపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. "ఎపీ ప్రగతిలో మోడీ పాత్ర కీలకం.
తాను ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల లోనే పుట్టానని.. తనతో గొడవ పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు సభలో ఆయన మాట్లాడుతూ.. "నేను వస్తున్నానని తెలిసి, హెలికాప్టర్ రాకుండా హెలిపాడ్ తవ్వి వేశారు.
మోసాలు చేసేందుకు దోచుకునేందుకు కూటమి సిద్ధంగా ఉందని.. వారి మాటలను నమ్మే మోసపోవద్దని రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గిరిజనులకు పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా అరకులోయలో వైసీపీ నిర్వహించిన రోడ్ షోకు ఆయన పాల్గొని మాట్లాడారు.
కాకినాడ గంజాయి కేంద్రంగా, డ్రగ్స్ క్యాపిటల్, దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారు అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ సభలో ఆయన మాట్లాడుతూ.. "జగన్ బినామీ ఇక్కడే ఉన్నాడు.
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి, వైసీపీ నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.