సోమవారం ప్రధాని మోడీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా.. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుందని విమర్శించారు. మోడీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రైల్వే జోన్ పై మోడీ అవగాహన లేకుండా మాట్లాడారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలని ఘాటు వ్యాఖ్యలు…
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ మోహాన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అందించామని తెలిపారు. అవ్వా తాతలకు ఇంటి వద్దకే పింఛన్, రేషన్, పథకాలు, పౌర సేవలు తలుపుతట్టి అందిస్తున్నాని అన్నారు. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మహిళలకు, మత్స్యకారులు, నేతన్నలకు తోడుగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు.. మూలపేట పోర్టు కడుతున్నాం.. భోగాపురం ఎయిర్ పోర్ట్, ఉద్దానం కిడ్ని సమష్యకు పరిష్కారం చూపించే…
పీలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ సైతం ప్రచారం ముమ్మరం చేసింది. మంత్రులు, కీలక నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తోట నరసింహంకు మద్దతుగా ఆయన తనయుడు రాంజీ ప్రచారం నిర్వహించారు. గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తన తండ్రిని ఆశీర్వదించాలని కోరారు. గతంలో తోట నరసింహం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగ్గంపేట అభివృద్ధిలో ముందు ఉందని గుర్తు చేశారు. జగన్ మళ్ళీ సీఎం అయితేనే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు పేదలకు అందుతాయని…
కృష్ణా జిల్లా మచిలీపట్నం మేమంతా సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతోంది.. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నిక కోసం జరిగే ఎన్నికలు కాదన్నారు. ఇంటింటికి భవిష్యత్‌లో పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలని సీఎం జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అమలు కాని హామీలు అని విమర్శించారు. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తాను చేసిన మంచి గురించి చెప్పే దమ్ము లేదని ఆరోపించారు. కొంత మంది మాజీ అధికారులను ప్రభుత్వంపై విషం చిమ్మెలా ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. పీవీ రమేష్ ఐఏఎస్‌గా పని చేశాడు.. ఇంత దిగజారి ప్రవర్తించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టర్ గారు కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా లీజుకు ఇచ్చారన్నారు. 70 ఎకరాల పొలాన్ని…
రాయలసీమలో మూడు సీట్లు వచ్చినందుకు ఎగతాళి చేశారని.. పులివెందులలో కూడా ఇపుడు వైసీపీ కి జగన్ కు ఎదురుగాలి వేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కల్లూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో భూహక్కు పత్రాన్ని తగల బెట్టారు.
మాజీ ముఖ్యమంత్రి, త్వరలో మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో దోపిడీ, ఇసుక మాఫియ, దేవుని భూములు కబ్జా జరిగిందని ఆరోపించారు.
రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెదేపా అభ్యర్థి జయచంద్రా రెడ్డిని గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు. అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..