సోమవారం ప్రధాని మోడీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా.. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుందని విమర్శించారు. మోడీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రైల్వే జోన్ పై మోడీ అవగాహన లేకుండా మాట్లాడారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకడు తానా అంటే.. ఇంకొకడు తందనా అంటున్నారని దుయ్యబట్టారు. మోడీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయాడని మంత్రి పేర్కొన్నారు.
Sai Pallavi : కోట్లు ఇచ్చిన ఆ పని చెయ్యనని చెప్పేసిన సాయి పల్లవి..
ఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదని తెలిపారు. మోడీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారని.. మోడీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు.. రాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపామని.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుడనని ట్వీట్ చేసిన మాజీ ఐఏఎస్ రమేష్కి, తనకు డిబెట్ పెట్టండని మంత్రి బొత్స ఛాలెంజ్ చేశారు. కూటమి నీచపు బుద్ది వలన సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పింఛన్లు అడ్డుకోవడం వలన అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని.. టీడీపీ, కూటమి ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pannun murder plot: ఖలిస్తాన్ పన్నూ హత్య కుట్రలో భారత్ దర్యాప్తుపై అమెరికా ఎదురుచూపు..