ప్రశ్నకే.... ప్రశ్నలు ఎదురవుతున్నాయా? నిలదీస్తానన్న స్వరానికే నిలదీతలు పెరుగుతున్నాయా? ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ను వైసీపీ నేతలు అడుగుతున్న తీరు చూస్తుంటే... ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ప్రభుత్వంలో ఎక్కడ తప్పు జరిగినా... తేడాగా ఏం చేసినా... ప్రశ్నిస్తా, నిలదీస్తానని గతంలో స్టేట్మెంట్స్ ఇచ్చారు పవన్.
YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారంటీ అని ప్రచారం చేశారు.. ఇప్పుడు ఆ బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అని రుజువు అయిందని ఎద్దేవా చేశారు.
YS Jagan: నారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (ఫిబ్రవరి 6) మీడియా ముందుకు రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటి గేటును ట్రాక్టర్ తో గుద్ది డ్యామేజ్ చేశారన్నారు.
సీఎం చంద్రబాబు రాయచోటి పర్యటనపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చిందని ఆరోపించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆనందకరమైన, ఆశ్చర్యకరమైన విషయం జరిగిందని మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో గురజాడ కవితను ప్రస్తావించడం ఆనందకరమైతే.. ఈ ప్రాంతం అభివృద్ధికి కనీస కేటాయింపులు లేక పోవడం బాధాకరం. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వాలు చూడటం సహజం.
పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్పై వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజంద్రనాథ్రెడ్డి స్పందించారు. నిర్మలమ్మ బడ్జె్ట్ సంతృప్తి నివ్వలేదన్నారు.
టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని.. పార్టీ ఫిరాయింపులను టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారని మండిపడ్డారు.
సూపర్ సిక్స్ అన్నాడు.. అయితే ఇప్పుడు అది సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కడప వైసీపీ జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.