సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉందని, సీఎం తన స్థాయిని దిగజార్చుకున్నారన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్సార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలన్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో టీడీపీ కూటమి నేతలు పోస్టింగ్స్ పెడుతున్నారని.. అయినప్పటికీ…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారని, సంక్షేమం పట్టించుకోవడం లేదని, అభివృధి ఎక్కడా కనిపించడం లేదని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్ రెడ్డికి 40…
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి తృటిలో ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ వద్ద జీపు దిగి లోపలికి వెళుతూ ఉండగా.. అకస్మాత్తుగా డ్రైవర్ జీపును ముందుకు కదిలించాడు. జీపు తగిలి పోసాని త్రూలి పడబోయారు. పక్కనే ఉన్న పోలీసులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. పోసాని సహా పోలీసు అధికారులు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన అనంతరం పోసాని ఓబులవారిపల్లె పీఎస్‌లోకి వెళ్లిపోయారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యుడు…
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు ఓబులవారిపల్లెకు తరలించారు. ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసానికి వైద్య పరీక్షలు చేశారు. ఓబులవారిపల్లి ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యులు గురు మహేష్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గురు మహేష్ స్టేట్మెంట్ను రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశం ఉంది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని రాయదుర్గంలో పోసానిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు, నారా…
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని మండిపడ్డారు. అరెస్ట్ నేపథ్యంలో పోసాని భార్య కుసుమలతను జగన్ ఫోన్లో పరామర్శించారు. అరెస్ట్ విషయంలో పోసానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని.. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. ‘ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోంది. అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను అని జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి తెలిపారు. తమ నాయకుని కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటే.. తాము కూడా మాట్లాడాలి అనుకున్నాం కానీ పవన్ వద్దని సూచించారని చెప్పారు. సంస్కారం అడ్డువచ్చే తాము అలా మాట్లాడలేదని, పోసాని ప్రవర్తన సరిగా లేకనే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. పోసానిపై గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఫిర్యాదులు చేసినా..…
సత్యవర్ధన్ కిడ్నాప్ వివాదం కేసులో కీలక ఆధారాలతో వైసీపీ ఓ వీడియో విడుదల చేసింది. వైసీపీ అధికారిక x ఖాతాలో పోస్ట్ చేసింది. ట్రూత్ బాంబ్ పేరిట ఎక్స్‌లో వైసీపీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం అంటూ ఆ వీడియోను జత చేసింది.
శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై పార్లమెంట్, అసెంబ్లీ నియమ నిబంధనలను లోకేష్ చదివి వినిపించారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పవన్ నోట మళ్ళీ క్షమాపణలు అనే పదం వచ్చింది. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ నిన్న విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని తెలిపారు. ఎన్డీఏ సభ్యులు 164 మంది చాలా బాధ్యతతో ఉన్నారు.. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, సీఎం చంద్రబాబులా మోసం చేయడం చేతకాదని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదని.. సూపర్ సిక్స్ టీ ఇచ్చేవారని విమర్శించారు. 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయిందన్నారు. నారా లోకేష్ చేసింది యువగళం కాదని.. నిన్న విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళం అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలో చేరికలు, వలసలు సర్వ సాధారణం…