విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ములాఖత్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, సింహాద్రి రమేష్ జైలు లోపలికి వెళ్లారు. ములాఖత్‌లో వంశీని పరామర్శించడానికి కొడాలి నాని,పేర్ని నాని పేర్లు కూడా వైసీపీ నేతలు ఇచ్చారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ ఇద్దరికీ అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు చెప్పారు. విజయవాడ…
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండోరోజూ కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నిక వరుసగా వాయిదా పడిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని రాహుల్ మీనా చెప్పారు. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో…
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ‘చలో తుని’ పిలుపునిచ్చిన నేపథ్యంలోరాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది. రాజా ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తుని వెళ్లొద్దంటూ రాజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తుని వెళ్లకుండా పోలీసులు రాజాను అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో రాజమండ్రి ప్రకాష్ నగర్లో ఉన్న రాజా ఇంటి వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది.…
ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందుల ఉప ఎన్నికపై ఆసక్తికర చర్చ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న సమయంలో పులివెందులకు ఉప ఎన్నిక రావాలని బాగా ముక్కుకో అంటూ మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కామెంట్ చేశారు. ఉప ఎన్నికలు వస్తే మీరే పులివెందులకు ఇన్చార్జిగా రావాలని రామకృష్ణం రాజుకు బిటెక్ రవి సూచించారు. ఉప ఎన్నికలు వస్తే తాను తప్పకుండా పులివెందులకు ఇన్చార్జిగా…
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. మంగళవారం ఉదయం ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. తమకు రక్షణ కల్పిస్తేనే ఎన్నికకు వస్తామని వైసీపీ కౌన్సిలర్లు ప్రకటించారు. 28 మంది కౌన్సిలర్లలో 15 మంది హాజరైతేనే ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక…
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పురపాలక సమావేశానికి మొత్తంగా 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వైస్ ఛైర్మన్‌గా 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఉన్నం భారతిని కౌన్సిలర్ ప్రతిపాదించగా.. మిగిలిన కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మరోవైపు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలో…
వైసీపీపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై కుట్రతో కొందరు అన్ని కార్యక్రమాల పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ 2.oలో ఊహించని అంశాలు ఉండబోతున్నాయా? ఓటమి తర్వాత ఆయన బాగా మారిపోయారా? అందుకే ఇప్పుడు గతానికి పూర్తి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఏంటా నిర్ణయాలు? వాటి ప్రభావం ఎంతవరకు ఉండవచ్చంటున్నారు? వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఓటు బ్యాంక్ దాదాపుగా ఆ పార్టీకి టర్న్ అయ్యింది. 95 శాతం దాకా కాంగ్రెస్ ఓటర్లను తన వైపునకు తిప్పుకోవటంలో సక్సెస్ అయిన జగన్… కొందరు కీలక నేతల విషయంలో మాత్రం లైట్‌గా ఉన్నారట. అప్పట్లోనే…
వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోరుతూ విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.. సమావేశంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధికి రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్న చంద్రబాబు అందులో 10శాతం రాయలసీమకు కేటాయిస్తే అభివృద్ది అవుతుందని పార్టీల నాయకులు పేర్కొన్నారు.. ఆంధ్రపదేశ్ అంటే అమరవతి, పోలవరమే కాదని.. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా అన్నారు.. కేంద్రంతో పోరాడి ఎందుకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు తీసుకుని రావడం లేదన్నారు.
Vijayasai Reddy: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా.. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే.. ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని పేర్కొన్నారు.