YS Jagan: ఇప్పుడే కృష్ణానదికి వరద నీరు ఇలా వస్తుంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. దాన్ని సరిదిద్దే కార్యక్రమమే రాయలసీమ లిఫ్ట్.. కొత్త రిజర్వాయర్లకు కాదు.. ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు పంపే కార్యక్రమమే ఇది.. తెలంగాణ, ఏపీ ఇద్దరూ ఒక్కటే.. తెలంగాణ ప్రాంతానికి నష్టం వచ్చే పనులు జగన్ ఎప్పుడూ చేయడని పేర్కొన్నారు. కానీ, ఈ ప్రాంతంలో ప్రజలకు అన్యాయం జరగకూడదు అనేది మా వాదన.. అందరం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పెరిగాం.. ఒక ఇంట్లో గొడవలు పెట్టి రాజకీయాలు చేస్తామంటే కరెక్ట్ కాదు.. 40 ఏళ్ల రాజకీయం అని చెప్పుకునే చంద్రబాబు ప్రజల గురించి ఎందుకు ఆలోచన చేయడు.. మేం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి సరిదిద్దుతూ వచ్చామని జగన్ తెలిపారు.
Read Also: Hyderabad: నగరంలో ఏకంగా రూ.2 కోట్ల విలువైన చైనా మంజా పట్టివేత.. తగిలితే గొంతు తెగాల్సిందే!
ఇక, తెలుగు గంగకు 500 కోట్లు ఖర్చు పెట్టి లింక్ కెనాల్స్ అందుబాటులోకి తెచ్చామని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గండికోట నీళ్లు స్టోరేజ్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేశాం.. చిత్రావతి ప్రాజెక్టుకు 280 కోట్లు ఖర్చు చేసి వాడుకలోకి తెచ్చాం.. వెలిగొండ ప్రాజెక్టుకు 2 టన్నెల్స్ పూర్తి చేసి రెండు దశాబ్దాల కల నెరవేర్చాం.. తెలుగు గంగకు కొన్ని దశాబ్దాలుగా పూర్తి స్థాయిలో నీళ్లు నింపలేదని విమర్శించారు. వీటిని పెండింగ్ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చాం.. పులిచింతల ప్రాజెక్టును కూడా ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. చిత్తశుద్ధి ప్రకారం అడుగులు వేస్తే దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయని తెలిపారు.
Read Also: Sara Arjun: ప్రభాస్, విజయ్‌లను బీట్ చేసిన ‘ధురంధర్’ భామ సారా అర్జున్!
అయితే, 800 అడుగుల్లోనే 3 టీఎంసీలు తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం అని మాజీ సీఎం జగన్ తెలిపారు. రూ. 1000 కోట్లు ఖర్చు చేసి వేగంగా పనులు చేశాం.. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైతే జగన్ కు మంచి పేరు వస్తుందని కుట్రలు చేశారు.. అందుకే, తెలంగాణలోని టీడీపీ కార్యకర్తలతో కేసులు వేయించారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాయలసీమ పనులు కొనసాగించామని పేర్కొన్నారు. హంద్రీనీవా నుంచి కుప్పం వరకు 500 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి నీళ్లు.. దాన్ని అధిగమించేందుకు మధ్యలో లిఫ్ట్ లు పెట్టాం.. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గరుండి మరీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఖూనీ చేశారని జగన్ రెడ్డి వెల్లడించారు.