నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరి మధ్యే మాటల తూటాలు పేలాయి. సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు సాగాయి. కట్ చేస్తే.. అనుచరులు సైతం ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏ శిబిరంపై ఈగ వాలినా రెండోపక్షం అస్సలు ఊరుకోవడం లేదట. ఇదే టెక్కలి రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. టెక్కలిలో వైసీపీ వర్సెస్ టీడీపీ! శ్రీకాకుళం జిల్లాలో రాజకీయమంతా ఇప్పుడు టెక్కలి చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా.. టెక్కలి ఎమ్మెల్యేగా ఏపీ…
40 ఇయర్స్ ఇండస్ట్రీ.. అపార చాణిక్యుడినంటూ చెప్పుకునే చంద్రబాబు చేసిన తప్పే మళ్లీ చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోందని రాజకీయవర్గాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. గతంలో ఆయన నమ్ముకున్న రెండుకళ్ల సిద్ధాంతం బెడిసి కొట్టి చివరికి రాష్ట్ర విభజనకు దారితీసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని నుంచి ఆయన ఏం గుణపాఠం నేర్చుకున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన మళ్లీ మళ్లీ అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ అందరినీ కన్ఫ్యూజన్ చేస్తున్నారని అంటున్నారు.…
నారా లోకేష్ పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు. తాజాగా ఎన్టీవీ తో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… లోకేష్ ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నాడు..రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడు. ప్రభుత్వం స్పందించకపోతే పరామర్శ కి వెళ్ళాలి గాని స్పందించిన తరువాత కూడా పరామర్శ దేనికి. ఘటన జరిగిన ఎన్నో నెలలకి పరామర్శ ఏంటి అని ప్రశ్నించారు. దిశా చట్టం తీసుకు రావాలని సీఎం ని ఎవరు అడగలేదు. ఆడ బిడ్డల…
జల్సారాయుళ్లు..! ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్. మంత్రి బాలినేని రష్యా టూర్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే.. ఇదేతరహాలో ఎంజాయ్ చేస్తున్న మరికొందరిపై ఫోకస్ పడింది. ప్రభుత్వవర్గాలు ఆరా తీస్తున్నాయట. అలా తీగకు తగిలిందే.. గోవా టూర్..! అధికారపార్టీ శిబిరంలో అలజడి రేపుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బాలినేని రష్యా టూర్‌పై చర్చ ఆగలేదు.. తెరపైకి మరో పర్యటన! ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రష్యా టూర్ ఓ హాట్‌టాపిక్. విలసవంతమైన ప్రైవేట్ జెట్‌లో రష్యా…
నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తారు… కానీ చంద్రబాబు, టీడీపీ మద్యపాన ఉద్యమం చేస్తాం అంటున్నారు అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబుకు మద్యపాన నియంత్రణ ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు. మేము మద్యం షాపుల సంఖ్యను సగానికి తగ్గించాం. ఈర్ష్య, ద్వేషం, పగ…ఈ మూడు చంద్రబాబు లక్షణాలు. కాబట్టి ప్రజా కోర్టులో చంద్రబాబుకు ఉరిశిక్ష వేశారు అని పేర్కొన్నారు. తాగుబోతులు, మద్య…
తరచూ వివాదాల్లో చిక్కుకోవడం.. ఆనక పార్టీ పెద్దలతో తలంటించుకోవడం.. ఆ మంత్రికి కామనైపోయిందా? అప్పట్లో పేకాట.. బెంజ్ కారు.. ఇప్పుడు SIని బెదిరిస్తున్న వీడియో…! మళ్లీ పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోక తప్పదా? ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా కథ? ఈ స్థాయిలో వరస వివాదాల్లో చిక్కుకున్న మరో మంత్రి లేరా? గుమ్మనూరు జయరామ్. ఏపీ కార్మిక శాఖ మంత్రి. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న జయరామ్.. మంత్రి అయ్యాక కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు.…
చేతిలో పెద్దపదవి ఉంది. నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం. కానీ.. ఆయన స్పీడ్‌కు బ్రేక్‌లు వేస్తున్నాయి వైరిపక్షాలు. ఇదేం తలపోటు అని అనుకుంటున్న సమయంలోనే సొంత పార్టీ కేడర్ నుంచి చికాకులు పెరిగాయట. ఇదే అక్కడ హాట్ టాపిక్. ఆయన ఎవరో.. ఆ శిరోభారాలేంటో ఇప్పుడు చూద్దాం. తమ్మినేని కొబ్బరికాయ కొట్టగానే స్టే తెస్తున్నారా? శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమదాలవలసలో ఇప్పుడు కొత్త తరహా రాజకీయాలు మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్…
ముఖ్యమంత్రి జగన్.. మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారా? త్వరలోనే ఆయన దేశ రాజధానిలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలవనున్నారా? ఈ ప్రశ్నలకు.. అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే.. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అపాయింట్ మెంట్ సైతం జగన్ కోరినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సమావేశం ఖరారైతే.. జగన్ ఢిల్లీ బయల్దేరే అవకాశం ఉంది. ఈ ఊహాగానాలు నిజమై ఢిల్లీకి వెళ్తే.. జగన్ ఏం చేయబోతున్నారు? కేంద్రం…
అవకాశం ఉన్న ఏ చోటునూ వదలకుండా విస్తరించుకుంటూ పోయేందుకు సీపీఐ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ లోనూ తమ వాణి వినిపించేందుకు.. అక్కడ సైతం జనాల్లో ఎంతో కొంత పట్టును పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే అమరావతి పోరాటంలో సీపీఐ నేతలు కాస్త క్రియాశీలకంగా ముందుకు పోతున్నారు. ఇతర సమస్యలపైనా.. ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. తాజాగా.. ఆ పార్టీ జాతీయ నాయకత్వం సైతం ఆంధ్రాపైనే దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ పెంచే దిశగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది.…
వినాయక చవితి పండగ దగ్గరికొస్తోంది. ఈ తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయి. వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని.. కోవిడ్ కారణంగా ఎక్కువగా జనాలు గుమికూడవద్దని ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. ఈ ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇదే.. బీజేపీ, టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఇతర కార్యక్రమాలకు అడ్డు రాని కరోనా.. ఇప్పుడు వినాయక చవితి పండగకే అడ్డు పడుతోందా.. అన్న చర్చ మొదలైంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత, మాజీ…