హైలెట్ అవ్వాలంటే హడావిడి చేయాలన్నదే ఆ ఎమ్మెల్యే ఫిలాసఫీనా? అధినేత దృష్టిలో పడి పదవి పొందాలనుకుంటున్నారా? అందరి కంటే ముందుండాలని అనుకున్నారా? తాజా రచ్చ వెనక కారణం అదేనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? జోగి రమేష్ దూకుడు వెనక కారణం వేరే ఉందా? మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. సీఎంను పట్టుకుని అంత మాట అంటావా అని ఏకంగా చంద్రబాబు ఇంటి దగ్గర రభస చేశారు…
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీ దూసుకుపోతుంది. ఆ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లోనూ వైయస్సార్సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైయస్సార్సీపీకి 17, టీడీపీకి 2 గెలిచాయి. అలాగే…. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా గెలిచింది వైయస్సార్సీపీ. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్నిచోట్లా గెలిచింది వైయస్సార్సీపీ. ఇక శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైయస్సార్సీపీ, 1 చోట టీడీపీ గెలుపొందాయి. మరో 6 చోట్ల ఫలితాలు…
ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిజంగా కన్నెర్ర చేస్తే మీరు రోడ్డు మీద తిరగగలుగుతారా ? అచ్చెన్నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల్లోకి వెళదాం… మీ సీట్లు మీకు మిగులుతాయో లేదో చూసుకుందామని పేర్కొన్నారు. ఓటమి తప్పదని ముందే టీడీపీ పారిపోయిందని… ఎన్నికలు బహిష్కరిస్తామని డ్రామాలు చేసిందని విమర్శించారు.రెండేళ్ల జగన్ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి చూసి…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఐఏఎస్ అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్…
ఏపీ ఫైబర్ నెట్ కేసు దర్యాప్తు లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాంబశివరావును గత ఐదు రోజులుగా విచారిస్తున్నారు. సాంబశివరావు గతంలో ఏపీ ఫైబర్ నెట్ ఎండీ గా వ్యవహరించిన సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫైబర్ నెట్ తొలి దశలో రూ. 320 కోట్ల టెండర్లలో రూ.. 121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. ఎండీ…
మూడు ప్రముఖ ఆలయాల ఛైర్మన్ గిరి పట్టేశారు. కానీ.. ఆనందం ఆవిరైంది. స్థానిక నినాదం వాళ్లను ఆ పదవులు చేపట్టకుండా చేసింది. స్థానికేతర నినాదం కాస్త గట్టిగానే తాకడంతో హైకమాండ్ కూడా పునరాలోచనలో పడింది. టోటల్గా పదవులు వచ్చి.. పదవులు చేపట్టని వారిగా ఆ ముగ్గురూ మిగిలిపోయారు. ఆలయాల పదవులపై స్థానిక నేతల గుర్రు! చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కాక రేపుతూనే ఉంది. జిల్లాలో ముగ్గురు వైసీపీ నేతలు శ్రీకాళహస్తి, కాణిపాకం సహా కర్నూలు…
అమరావతి : అయ్యన్నపాత్రుడు సమాజానికి పట్టిన చీడ అని.. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని.. హోమ్ మంత్రి మేకతోటి సూచరిత ఫైర్ అయ్యారు. దళిత హోం మంత్రిగా సీఎం జగన్ నాకు అవకాశం కల్పించడం టీడీపీ నేతలకు రుచించడం లేదని… అయ్యన్నపాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలకు బాధ పడుతున్నాని తెలిపారు. దళిత మహిళకు ఉన్నత పదవి ఇవ్వడం అయ్యన్నపాత్రుడుకు నచ్చడం లేదా ? అయ్యన్న పాత్రుడు సంస్కార హీనంగా మాట్లాడారని నిప్పులు చెరిగారు.…
ఎట్టకేలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టిన అనంతరం ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజల్ట్ ఉంటుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అన్ని జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే ధీమా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జెడ్పీటీసీ ఛైర్మన్ల పేర్లను సైతం ఖారారు చేసినట్లు సమాచారం అందుతోంది. పదవుల పంపకం విషయంలో…
ఏపీ సీఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఇవాళ చంద్రబాబు ఇంటి దగ్గర ఘటనపై లోకేష్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షనేత ఇంటిపైకి ఎమ్మెల్యేను పంపి… సీఎం జగన్ తన స్థాయిని దిగజార్చుకున్నాడని… దీన్ని బట్టి ఆయన ఎంత వణికిపోతున్నాడోనని లోకేష్ పేర్కొన్నారు. “జగన్ వి గాలి హామీలు అని తేలిపోయాయి. ముద్దులు పిడిగుద్దుల్లా పడుతున్నాయి. జగన్ది అంతా నాటకమనీ జనానికి తెలిసిపోయింది. జనం తిరగబడే రోజు దగ్గరపడిందని, ఉలిక్కిపడి ప్రతిపక్షంపైకి వాళ్లనీ,వీళ్లనీ పంపడం ఎందుకు?…
అధికారపార్టీలో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. అధినాయకుడి ఫ్యామిలీకి వీరవిధేయుడు. అలాంటి శాసనసభ్యుడికి హైకమాండ్ ఓ ఆఫర్ ఇచ్చింది. పిలిచి పదవిస్తే ససేమిరా అన్నారు. ఆఫర్ తిరస్కరించి కొత్త చర్చకు తెరతీశారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే? అధిష్ఠానం ఇచ్చిన అవకాశం ఏంటి? తనకు టీటీడీ పదవా అని పెదవి విరిచారట!ఎమ్మెల్యే అసంతృప్తితో పార్టీ పునరాలోచన? తిరుమల శ్రీవారి సేవాభాగ్యం కోసం రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పోటీపడుతుంటారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యుడిగా ఒక్కసారైనా పనిచేయాలని కలలు కంటారు. సుదీర్ఘ…