కరోనా తీవ్రత ఇంకా తగ్గనేలేదు. ప్రతి రోజు ప్రతి రాష్ట్రంలో వందల సంఖ్యలో ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయినా.. రాజకీయ కార్యకలాపాల జోరు మాత్రం తగ్గడం లేదు. ప్రత్యామ్నాయాలు ఉన్నా.. వాటిని పాటించడంలో పార్టీల నాయకత్వాలు, నేతలు ఏ మాత్రం పట్టింపు లేకుండా పోతుండడం.. జనానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. లక్షలాదిగా జన సమీకరణ చేస్తుండడం కరోనా వ్యాప్తికి కారణం అవుతుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ సభలు.. పాదయాత్రలు, సమావేశాలను కాస్త నివారించినా.. అది అందరికీ మేలు…
వైసీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి ముందుగానే రెండున్నరేళ్ల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని హింట్ ఇచ్చారు. అందుకనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ రిపోర్టు తెప్పించుకొని కొత్త క్యాబినెట్ కూర్పుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే దసరా లేదంటే దీపావళి నాటికి ఏపీలో కొత్త క్యాబినెట్ కొలువుదీరడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఈనేపథ్యంలో ఆశావహులంతా జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు తమవంతు ప్రయత్నాలు…
వైఎస్ జగన్.. వైఎస్ షర్మిల. అన్నా చెల్లెళ్లు. అన్న.. ఆంధ్రను ఇప్పటికే ఏలుతున్నారు. చెల్లెలు తెలంగాణ వేదికగా రాజకీయం వేడిగా ప్రారంభించారు. ప్రతి మంగళవారం చెప్పినట్టుగా నిరుద్యోగుల తరఫున పోరాట దీక్ష చేస్తున్నారు. కడుపు మాడ్చుకుని మరీ.. దీక్షలతో వార్తలతో చోటు పొందుతున్నారు. విమర్శల ధాటి పెంచుతున్నారు. ఈ క్రమంలో.. జగన్ తీరుపై చాలా మందికి ఎప్పుడో స్పష్టత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తప్ప.. పొరుగున ఉన్న తెలంగాణలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని.. ఆయన క్యాంప్…
గతంలో హడావిడి ఎక్కువగా ఉండేది.. పని తక్కువగా ఉండేది.. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు.. కాగితాల మీద మాత్రమే అగ్రిమెంట్లు కనబడేవి అంటూ గత ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్స్‌ను ఆదుకునేందుకు ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం…
అప్పన్న దేవాలయానికి సంబంధించిన భూముల అవకతవకల్లో ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పాత్ర ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని…అసలు ఆయన ధర్మకర్త..లేక అధర్మ కర్తా అని ఫైర్ అయ్యారు విజయ సాయి రెడ్డి. సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయన భూములు, దేవాలయంలో ఆస్థులలో అవకతవకలకు పాల్పడకపోతే కోర్టు కు వెళ్లి మళ్ళీ పదవి తెచ్చుకోవడం చూస్తుంటే అదే అనుమానం కలుగుతోందని ఎద్దేవా…
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామస్మరణతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. వైఎస్ఆర్ మావాడంటే.. మావాడంటూ నేతలు పోటీపడుతున్నారు. ఇదికాస్తా శృతిమించుతుండటంతో అందరిబంధువైన వైఎస్ఆర్ ఇప్పుడు కొందరివాడుగా మిగిలిపోతున్నాడు. నిన్న హైదరాబాద్‌లో వైఎస్ విజయమ్మ నిర్వహించిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనంగా సాక్షిగా ఈ విషయం రుజువైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనందరినీ విడిచి 12ఏళ్లు గడుస్తుంది. నిన్ననే ఆయన 12వర్ధంతిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు నిరాడంబరంగా జరుపుకున్నారు. ఇడుపుపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్…
ఆ జిల్లాలో మొన్నటి వరకు ఒక్కరే పెత్తనం చేసేవారు. అధికారులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అధికార పార్టీలో గ్రూపులు పెరిగి.. ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. తిరుగుబాటులు మొదలయ్యాయి. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారపార్టీ నేతలు జూలు విదిల్చారా? పదేళ్లు అధికారంలో లేం. పవర్లోకి వచ్చాక చెబుతాం. రెండేళ్ల క్రితం వైసీపీ నేతల వాయిస్ ఇది. కానీ.. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల…
పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై లోకేష్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. లోకేష్ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. 2016లో స్పెషల్ ప్యాకేజ్ లో భాగంగా పోలవరం అంచనాలు 20వేల కోట్లకు కుదిస్తే చంద్రబాబు సంతకాలు చేశారు. కానీ సీఎం జగన్ సూచనల మేరకు పోలవరం నిధల కోసం పార్లమెంటు సమావేశాలు స్తంభింపచేశాం. ఇటీవలే పోలవరం సవరించిన అంచనాలు 47వేల కోట్లకు కేంద్రం…
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… ప్రపంచ చరిత్రలో మానవత్వం ఉండే నాయకుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు అని తెలిపారు. చరిత్ర పుటల్లో స్వర్ణక్షరాలతో రాయదగిన వ్యక్తి వైఎస్సార్. సమాజం మీద ప్రేమను చాటడమే కాకుండా కేవలం 5 ఏళ్ళల్లో ప్రజల జీవితాల్లో ఎంత ముద్ర వేయవచ్చో నిరూపించిన వ్యక్తి అని తెలిపారు. ఆయన నాటిన మొక్కే ఇవాళ జగన్ మహా వృక్షం అయి మన ముందు ఉన్నారు. తండ్రికి తగిన తనయుడు.…
సిమ్లా పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. ఇక రేపు, ఎల్లుండి వైఎస్ఆర్ కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 02వ తేదీన ఉదయం 9.30 గంటలకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి…